విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది.అయితే నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేత బండారు సత్యనారాయణ మూర్తి అభ్యర్థిత్వంపై హైకమాండ్ సమాలోచన చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. కానీ మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీపై బండారు సత్యనారాయణ మూర్తి సముఖంగా లేరని సమాచారం తెలుస్తుంది. అలాగే మరోవైపు టీడీపీ అధిష్టానం వైఖరితో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ నేపథ్యంలో అభ్యర్థి పైలా ప్రసాద్ కు వ్యతిరేకంగా రామానాయుడు వర్గీయులు భారీగా ర్యాలీలు ఇంకా అలాగే నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభ్యర్థి మార్పు ఉంటుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక పోతే తెలుగు దేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా పార్టీ మారకుండా పార్టీలో ఉంటూ చాలా పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి పెందుర్తి టికెట్ దక్కలేదు.


ఆయనకు కాకుండా పొత్తులో భాగంగా ఆ టికెట్ ని జనసేన పార్టీకి తెలుగు దేశం పార్టీ కేటాయించడం జరిగింది.దాంతో బండారు సత్యనారాయణమూర్తికి తీవ్ర మనస్తాపానికి చెందారు. ఆ బాధతో ఆయన ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. ఇక ఆయన ఇటీవల తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి తన బాధను అంతా కూడా పంచుకున్నారు. తాను తెలుగు దేశం పార్టీకి ఎంతో సేవ చేస్తే టికెట్ దక్కలేదని ఆయన కలత చెందారు.దాంతో పాటు ఇక తనకు రాజకీయాలు అవసరం లేదని తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా బండారు సత్యనారాయణమూర్తి సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఆయన వద్దకు టీడీపీ సీనియర్ నేతలు చాలా మంది వెళ్లి బుజ్జగించినా కానీ బండారు తన పట్టు మాత్రం వీడ లేదు. ఇటీవల ఆయన వద్దకు అనకాపల్లిలో టీడీపీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కూడా వెళ్లారు. ఆయనతో చర్చించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: