తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. అయితే అన్ని పార్టీల దృష్టి కూడా మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పైన ఉంది. మల్కాజిగిరిలో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధించవచ్చు అని అన్ని పార్టీలు ఒక సెంటిమెంట్ ను నమ్ముతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గం లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బిజెపి నుంచి ఈటల రాజేందర్  కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు .


 ఇక్కడ గెలుపే లక్ష్యంలో ఎవరికి వారు హామీల వర్షం కురిపిస్తూ పావులు కదుపుతూ ఉన్నారు. అయితే ఇటీవల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి లో బీఆర్ఎస్ సన్నాహక  సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి హుజురాబాద్ లో చల్లని రూపాయిగా మారిన ఈటెల.  ఇప్పుడు మల్కాజ్గిరిలో చెల్లుతారా అంటూ ప్రశ్నించాడు పాడి కౌశిక్ రెడ్డి. తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటెల పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆరోపించాడు.


 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ ఈటల రాజేందర్ దగ్గర 25 కోట్లు తీసుకుని ఇక ఆయన గెలుపుకు మద్దతుగా నిలిచాడని.. ఏకంగా అక్కడ కాంగ్రెస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ ను నిలబెట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పాడి కౌశిక్ రెడ్డి   ఇప్పుడు బిజెపితో కుమ్మక్కై మరోసారి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గం నిలబెట్టి ఈటలను గెలిపించేందుకు ప్లాన్ వేశాడు. హుజురాబాద్ ఉప ఎన్నికలు ఏదైతే చేశాడో ఇప్పుడు మల్కాజిగిరిలో అదే చేయబోతున్నాడు. ఒకప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల టికెట్ తనకి రావాల్సి ఉన్నప్పటికీ రేవంత్ 25 కోట్లు తీసుకుని టికెట్ అమ్ముకున్నాడు. దీంతో తాను బీఆర్ఎస్ పార్టీలో చేరా. డమ్మీ అభ్యర్థి బల్మురు వెంకట్ కు పోటీలో పెడితే 2500 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటూ పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: