ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి.నిత్యం ప్రజలతోనే ఉంటూ వారిని ఆకట్టుకునేందుకు వరుస హామీలు ఇస్తున్నారు..అయితే అధికార పార్టీ నేత జగన్ ప్రత్యర్థులపై సరికొత్త రాజకీయం ప్రయోగిస్తున్నారు.. రాష్ట్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు.. దీనిలో భాగంగా ప్రత్యర్థి కూటమి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ అదిరిపోయే స్కెచ్ వేశారు..గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. అయినా కూడా ఓటమి గురించి ఆలోచించకుండా పవన్ ముందడుగు వేశారు.. నిత్యం ప్రజల కష్టాలు తెలుసుకుంటూ తన పార్టీని ప్రజల్లో బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు.. 

రాష్ట్రం లో ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా బలంగా వున్న జగన్ ను ఎదుర్కొనేందుకు జనసేన సిద్ధంగా లేదని తెలిసి పవన్ ప్రధాన ప్రతి పక్ష పార్టీలు అయిన టీడీపీ, బీజేపీ తో కలిసి కూటమిగా ఏర్పడింది. ఈ సారి జగన్ ఓటమే లక్ష్యంగా పవన్ ముందుకు సాగుతున్నారు. అయితే పొత్తులో భాగంగా పవన్ కు కేవలం 21 సీట్లు మాత్రమే లభించాయి.. దీనిని అదునుగా తీసుకున్న జగన్ పవన్ పై సూపర్ స్కెచ్ వేశారు. పవన్ తీసుకున్న ఆ 21 సీట్లలో కూడా ఎప్పటినుంచో పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని బీజేపీ, టీడీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన నాయకులకు ఇవ్వడంతో అక్కడి నాయకులు తీవ్ర అసంతృప్తి గురి అవుతున్నారు. ఇదే అదునుగా భావించిన జగన్ అసంతృప్తితో వున్న జనసేన నేతలను తన పార్టీలోకి తీసుకోని వారితో పవన్ ను తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నాడు.. పవన్ పై జగన్ నేరుగా విమర్శలు చేయకుండా ఇలా వారి పార్టీ నేతలతోనే జగన్ ను విమర్శిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: