ప్రతి రాజకీయ పార్టీకి కచ్చితంగా స్టార్ క్యాంపెనింగ్ బ్యాచ్ ఉంటుంది. అలాంటి వారిని ఆ పార్టీలు ఎన్నికల సమయంలో రంగంలోకి దించుతూ ఉంటాయి. అక్కడ అయితే పోటీ బలంగా ఉంటుంది అని ఆ పార్టీలు అనుకుంటాయో అక్కడ స్టార్ క్యాంపెనింగ్ బ్యాచ్ తో ప్రచారాలను చేయించి కొంత ఓట్ల శాతాన్ని పెంచేందుకు వారు దోహదపడతారు.

ఇక తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ "జనసేన" అనే పార్టీని చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. పార్టీ ప్రారంభించిన తర్వాత జనసేనలో అనేక మంది స్టార్ క్యాంపెనర్ లు ఇండస్ట్రీ నుండి ఉంటారు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ విధంగా జరగడం లేదు. ఇక ఈ సారి కూడా పవన్ జనసేన పార్టీలో పెద్దగా స్టార్ క్యాంపెనింగ్ ఎవరు లేరు అనే చెప్పాలి.

ఈయన ఈ సారి పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నుండి నాగబాబు, మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు, ఆది మరి కొంత మంది జబర్దస్త్ కమెడియన్లు స్టార్ కాంపైనర్లుగా పిఠాపురంలో ఉన్నారు. ఇక నాగబాబు, అంబటి రాయుడు విషయం పక్కన పెడితే జబర్దస్త్ బ్యాచ్ ని కూడా స్టార్ క్యాంపెనర్లుగా జనసేన ట్రీట్ చేయడం ప్రజలకి కాస్త నవ్వు తెప్పిస్తుంది.

పిఠాపురంలో ఇప్పటికే ఆది ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలను కూడా మొదలుపెట్టాడు. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లక్ష ఓట్లకు పైగా మెజారిటీ వస్తుంది అని ఆయన చెబుతూ వస్తున్నాడు. లక్ష ఓట్ల మెజారిటీ సంగతి పక్కన పెడితే ఆది లాంటి వ్యక్తి ప్రచారం చేసినట్లు అయితే పవన్ కి ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉందా అని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: