•ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాలే బలం
•కులాంతర వివాహమే సాంబశివారెడ్డి కోరిక తీర్చిందా
•జొన్నలగడ్డ పద్మావతి సక్సెస్ కి పాదయాత్రే కారణమా..


(రాయలసీమ - శింగనమల నియోజకవర్గం - ఇండియా హెరాల్డ్)
కొన్ని కుటుంబాలు చాలా వరకు కులాంతర వివాహాలను అంగీకరించవు..కానీ కొంతమంది పెద్దలను ఎదిరించి మరీ కులాంతర వివాహాలు చేసుకొని సక్సెస్ అయ్యి నిరూపించారు.. ప్రత్యేకించి ఇలా కులాంతర వివాహాలు చేసుకుని సక్సెస్ అయిన వారిలో రాజకీయ రంగానికి చెందినవారు ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు.. అలాంటి వారిలో శింగనమల నియోజకవర్గం వర్గానికి చెందిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆమె భర్త సాంబశివారెడ్డి... వీరిద్దరిది కులాంతర వివాహమే కానీ రాజకీయంగా అటు విద్యాసంస్థల పరంగా భారీ సక్సెస్ ని చూస్తున్నారు.. మరి ఈ కులాంతర వివాహం వీరికి అటు రాజకీయంగా ఏవిధంగా ఉపయోగపడింది అనే అంశం ఇప్పుడు ఒకసారి చూద్దాం.

నెల్లూరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జొన్నలగడ్డ పద్మావతి అనంతపురం జేఎన్టీయూ కాలేజ్ లో ఎంటెక్ పూర్తి చేశారు.. అయితే అదే సమయంలో అనంతపురం జిల్లా తూర్పు నరసాపురానికి చెందిన సాంబశివారెడ్డి అదే కాలేజీలో బిటెక్ మరియు ఎంటెక్ పూర్తి చేశారు.. అదే సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. అదే పెళ్లికి కారణమైందని.. అలా 2004లో వీరు వివాహం చేసుకున్నారని స్థానికంగా చెబుతూ ఉంటారు.. సాంబశివరెడ్డి విద్య పరంగా ఉన్నతంగా ఆలోచించేవారు.. ఈ నేపథ్యంలోనే బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురం లో 2008  ఎస్ఆర్ఐటి పేరుతో ఒక కాలేజీని స్థాపించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు..

వాస్తవానికి రాజకీయంగా అడుగులు వేయాలనుకున్న సాంబశివారెడ్డికి అనుకూలంగా సమయం కలసి రాలేదు.. అయితే అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో సాంబశివారెడ్డి చేరారు..  2014 ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో శింగనమల నుంచి పోటీ చేయాలనుకున్నారు.. అయితే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తన భార్యను పోటీలోకి దింపారు. అలా 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సింగనమల నియోజకవర్గం నుండి పోటీ చేసిన జొన్నలగడ్డ పద్మావతి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి.యామిని బాల చేతిలో 4,524 ఓట్లు తేడాతో ఓటమిపాలయ్యారు.

ఓటమి తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ "మేలుకొలుపు" పేరిట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించింది పద్మావతి.. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ శింగనమల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణి పై ఏకంగా 46,242 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది.. అలా సాంబశివరెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకోగా ఆయనకు అవకాశం రాలేదు.. దాంతో తన భార్య విజయం సాధించిన తర్వాత తన భార్య ద్వారా అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన చిరకాల వాంఛనాను తీర్చుకున్నారు.. ఆ తర్వాత విద్యాశాఖ సలహాదారుడుగా కూడా పనిచేశారు సాంబశివారెడ్డి.  అలా తన రాజకీయ భవిష్యత్తును తన భార్య జొన్నలగడ్డ పద్మావతి ద్వారా రూపొందించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టారు సాంబశివారెడ్డి.

ముఖ్యంగా శింగనమల నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం , రెడ్డి సామాజిక వర్గాలు వీరికి బాగా కలిసి వచ్చాయి. ఇక ఈ రెండు సామాజిక వర్గాలే వీరిని రాజకీయంగా నిలబెట్టాయని చెప్పవచ్చు.. అలా కులాంతర వివాహం వీరికి బాగా కలిసి వచ్చింది.  ప్రస్తుతం శింగనమల నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి తరఫున వీరాంజనేయులు పోటీ చేస్తుండగా.. ప్రత్యర్థి టిడిపి పార్టీ నుంచి బండారు శ్రావణి పోటీ చేయబోతున్నారు. మరి ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: