ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప జిల్లాకు ప్రత్యేకత ఉంటుంది. ఈ జిల్లాలో మొత్తం వైయస్ ఫ్యామిలీ చెప్పిందే వేదం. రాజశేఖర్ రెడ్డి నాయకత్వం వహించినప్పటి నుంచి ఈ జిల్లా వైయస్ ఫ్యామిలీ మెంబర్స్ కు కంచుకోటగా ఉందని  చెప్పవచ్చు. అలాంటి కడప జిల్లాలో ఈసారి లెక్కలు మారుతున్నాయి.  ఎవరి కంట్లో వారే పొడుచుకున్నట్టు, వైయస్ ఫ్యామిలీ నుంచి తిరుగుబాటు మొదలై షర్మిల ఎంపీగా పోటీ చేస్తోంది. అంతేకాకుండా ఎలాగైనా జగన్ ను  గద్దె దించాలనే ప్రయత్నాలు చేస్తోంది. మరి కడప జిల్లాలో వైయస్ షర్మిల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా.?  జగన్ మానియాని ఏమైనా తగ్గిస్తుందా.? అనే విషయంలోకి వెళ్తే.. 

 జగన్ నిమిషం తీరిక లేకుండా ప్రచారంలో  దూసుకుపోతున్నారు. ఇదే తరుణంలో  కడప జిల్లాపై స్పెషల్ ఎఫెక్ట్ పెట్టింది చెల్లి షర్మిల. అంతేకాకుండా ఆమెకు తోడుగా  సునీత కూడా సపోర్ట్ చేస్తోంది. ఈ విధంగా జగన్ ఫ్యామిలీ నుంచి ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో అలర్ట్ అయ్యారు  వైసిపి క్యాడర్. దీంతో జగన్ భార్య భారతిని  రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. జగన్ పోటీ చేసే పులివెందులలో షర్మిల బస్సు యాత్ర ప్రారంభించి హడావిడి చేస్తోంది. అధికార వైసిపిపై విమర్శలు చేస్తోంది.  ఇదే తరుణంలో గత ఎన్నికల్లో పులివెందుల నుంచి లక్ష మెజారిటీ దగ్గరగా గెలిచిన జగన్ ఈసారి అంతకు ఎక్కువ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. కానీ షర్మిల ఎంట్రీతో అది కాస్త తగ్గే అవకాశం కనిపిస్తున్న తరుణంలో  భారతీ అలర్ట్ అయింది.

త్వరలోనే ఆమె పులివెందులలో ప్రచారం మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా భర్త జగన్ కు లక్ష మెజారిటీ దాటించాలని,  అలాగే మరిది అవినాష్ రెడ్డికి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ తీసుకువచ్చి గెలిపించాలని చూస్తుందట. అందుకోసమే  ఇంటింటా ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. అలాగే సపోర్టింగ్ టీం కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు బయటకు రావడంతో  కడప జిల్లా రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ విశ్లేషకులు కడపలో షర్మిల ఎఫెక్ట్ పడుతోందని, అందుకే జగన్ అలర్ట్ అయ్యారని  చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: