- కింజారాపు ఫ్యామిలీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భ‌వానీ అవుట్‌.. భ‌ర్త వాసు ఇన్‌
- పెందుర్తి నుంచి రాము మామ బండారు సీటు గ‌ల్లంతు.. మాడుగుల ఇస్తార‌ని ఆశ‌
- టెక్క‌లిలో అచ్చెన్న‌, శ్రీకాకుళం ఎంపీగా రాముకు మ‌ళ్లీ ఎదురు లేన‌ట్టేనా ?

(  గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
దివంగత కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కులు ఎర్రంన్నాయుడు ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీలు.. కులాలు.. మతాలకు అతీతంగా చెక్కుచెదరని అభిమానం ఉంది. అటు ఉత్తరాదిన శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఇటు గోదావరి.. కోస్తా జిల్లాల వరకు ఎర్రం న్నాయుడు అంటే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో అభిమానం ఎర్రం న్నాయుడు మరణాంతరం అటు ఆయన సోదరుడు ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెం న్నాయుడు ఇటు ఎర్రం న్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు ఇద్దరు రాజకీయంగా దూసుకుపోతున్నారు. 2024 తాజా ఎన్నికలలోను బొత్స ఫ్యామిలీ నుంచి మళ్లీ ముగ్గురు పోటీలో ఉన్నారు.


అచ్చె న్నాయుడు తన సిట్టింగ్ సీటు టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుంటే.. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి మరోసారి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. టెక్కలిలో అచ్చన్న.. శ్రీకాకుళంలో ఎంపీగా రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయాలు సాధించడంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. ఇక ఈ కుటుంబానికి చెందిన ఎర్రం న్నాయుడు కుమార్తె ఇటు రాజమండ్రి ఆదిరెడ్డి ఫ్యామిలీకి కోడలు అయిన ఆదిరెడ్డి భవాని గత ఎన్నికలలో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి ఏకంగా 33 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.


అంత జగన్ వ్యతిరేక ప్రభంజనంలోనూ భవానికి ఏకంగా 33 వేల ఓట్ల మెజార్టీ రావడం రాష్ట్ర రాజకీయ వర్గాలను సైతం నివ్వెర పరిచింది. ఈ సారి భ‌వానీ ప్లేస్‌లో ఆమె భ‌ర్త ఆదిరెడ్డి వాసు రాజ‌మండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలా జగన్ ప్రభంజనంలోనూ ఎర్రం నాయుడు ఫ్యామిలీ నుంచి తమ్ముడు, కొడుకు, కూతురు ముగ్గురు విజయం సాధించి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశారు. ఆ త‌ర్వాత నుంచి జ‌గ‌న్ గ‌త ఐదేళ్ల‌లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరి హ‌వాను ఎలా త‌ట్టుకోవాలా అని ర‌క‌ర‌కాల ఎత్తులు  వేసుకుంటూ వ‌స్తోన్నా వీరి క్రేజ్‌ను ఏ మాత్రం క‌ద‌ప లేని ప‌రిస్థితి.


ఇక విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నుంచి పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి పొత్తులో భాగంగా సీటు దక్కలేదు. ఆయ‌న రాముకు మామ కాగా.. దివంగ‌త ఎర్రం నాయుడికి స్వ‌యానా వియ్యంకుడు. పెందుర్తి సీటును పొత్తులో జనసేన కేటాయించారు అయితే చివరి నిమిషంలో సత్యనారాయణకు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సీటు కేటాయిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది అదే జరిగితే మళ్లీ ఎర్రన్న కుటుంబానికి నాలుగు సీట్లు దక్కినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: