వెండితెరకు, సినీ రంగానికి విడదీయలేని అనుబంధం ఉంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన హీరోలు పార్టీని స్థాపించి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యుగా విజయం సాధించారు.  ముఖ్యమంత్రులు అయ్యారు. జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యువ రాజ్యం పేరిట రాజకీయ రంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత జనసేనను స్థాపించారు.


అయితే ఈయన్ను పార్ట్ టైం పొలిటిషియన్ అనే విమర్శను మూట గట్టుకున్నారు. సీరియస్ గా రాజకీయాలు చేయలేరని చాలా మంది విమర్శిస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ముద్రగడ పద్మనాభం సైతం రాజకీయాల్లో నటించకు పవన్ అంటూ చురకలంటించారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ బాండీ లాంగ్వేజ్.. ప్రసంగాలు.. డైలాగ్ లు చెప్పినట్లే ఉంటాయి కానీ ప్రజలను ఆలోచింపజేయనియ్యవు అనేది కొందరి మాట. అయితే రంగస్థలానికి, రాజకీయ రణ రంగానికి చాలా తేడా ఉందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.


రాజకీయాల్లో హీరోలకు మించి ఆ పార్టీ నాయకులు నటిస్తారని వివరిస్తున్నారు. తమకు అనుకూలంగా రాజకీయ వైఖరి మార్చుకుంటూ.. పార్టీలు ఫిరాయిస్తూ.. ప్రత్యర్థులను తిడుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే వారు కూడా నటిస్తున్నట్లే కదా. 2019కి ముందు మోదీ ప్రభుత్వంపై అటు టీడీపీ, ఇటు వైసీపీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అది 2023కి వచ్చే సరికి ఇరు పార్టీలు కూడా కేంద్రంపై అవిశ్వాసం పెడితే బీజేపీకి మద్దతు ప్రకటించాయి.


అప్పుడు నచ్చిన మోదీ ఇప్పుడు ఎలా నచ్చారు. ఇది నటన కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఏ పార్టీ రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం పలు సందర్భాల్లో తమలో ఉన్న నటనను బయటకు తీస్తారు. ప్రజల కోసం.. రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు.. లేక మద్దతు అంటూ చెబుతుంటారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: