ఇక కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిళ పోటీ చేయడం.. పైగా ఆమెకు ఆమె సోదరి సునీత తన మద్దతు తెలపడం.. వీరిద్దరూ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జగన్ - అవినాష్ లపై తీవ్ర ఆరోపణలు ఇంకా విమర్శలు చేయడం రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం రోజు రోజుకీ చినికి చినికి గాలివానగా మారుతుంది. ఇక కోర్టు పరిధిలో ఉన్న విషయాలపై నేరుగా నిందితులను నేరస్థులుగా చిత్రీకరించడం ఏమిటని అనేక రకాల కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈ సందర్భంగా స్పందించిన వారి మేనత్త వైఎస్సార్ సోదరి విమల... ఇంటి ఆడపడుచులు ఇద్దరూ ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. తాను కూడా ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నట్లు తెలిపిన విమల... షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసినట్లు చెబుతూ.. షర్మిలకు అసలు లీడర్ షిప్ క్వాలిటీ అనేదే లేదని స్పష్టం చేశారు.


అసలు ప్రతీ రోజూ కూడా అదే పనిగా అవినాష్ రెడ్డి పై షర్మిళ విమర్శలు గుప్పిస్తున్నారని.. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ని కూడా ఇందులోకి లాగుతున్నారని వై ఎస్ విమల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇదే క్రమంలో... వివేకాను అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా? అసలు వాళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు? హత్య చేసినవాడు బయట తిరుగుతూ చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా? అంటూ విమల ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది.అసలు ఏ పాపం కూడా చేయని తమ సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడని గుర్తు చేసిన విమల... అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో వీళ్ళు అల్లర్లు రేపుతున్నారు.. మేనత్తగా చెప్తున్నా.. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం చాలా తప్పు.. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందంటూ షర్మిళ, సునీతల పై వారి మేనత్త విమల సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: