సాధారణంగా చాలామంది రాజకీయ నాయకులు సినీ హీరోలు  వారి డ్రైవర్ల విషయంలో కానీ వ్యక్తిగత కార్యదర్శుల విషయంలో కానీ వారికి నమ్మకమైన వ్యక్తులను పెట్టుకుంటూ ఉంటారు. వారికి సంబంధించిన ఏ విషయం అయినా ఆ వ్యక్తిగత వ్యక్తులతో తప్పక పంచుకుంటారు. ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి సూరీడు అనే వ్యక్తి నమ్మకమైన వ్యక్తిగా ఉండేవారు. ఆయన మరణాంతరం  సూరీడి జాడే లేదు. తన కొడుకు సీఎం జగన్ సూరీన్ని దగ్గర పెట్టుకుంటాడని చాలామంది భావించారు. 

 కానీ సీఎం జగన్ సూరీణ్ణి కాదని మరో వ్యక్తిని తన దగ్గర ఉంచుకుంటున్నారు. జగన్ ఎక్కడున్నా ఆ వ్యక్తి నీడలా అక్కడే ఉంటాడు. ఆయన ఏ విషయంలో అయినా పాలుపంచుకుంటాడు. ఆయన ప్రచార సభల్లో జగన్ పక్కనే ఉండి స్పీచ్ పేపర్లను అందిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే నాగేశ్వర్ రెడ్డి. ఈయనను కేఎన్ఆర్ అని పిలుస్తారు. జగన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి ఆయన వెంటే ఉంటున్నాడు. ఈ విధంగా జగన్ నమ్మిన బంటుగా ఎప్పుడూ ఉంటాడు. అంతే కాకుండా ఆయన పక్కన ఉంటే జగన్ కు ఏదైనా కలిసి వస్తుందని  అంటుంటారు. ఈ వ్యక్తి సీఎం జగన్ సొంత జిల్లా  కడపకి చెందిన వ్యక్తేనట.
 
ఈయన జగన్ దగ్గరికి రాక ముందు పలు మీడియా సంస్థల్లో  వర్క్ చేశారట.  జగన్ మొదటిసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనకు వ్యక్తిగత పీఏగా జాయిన్ అయ్యి,  జగన్ సంకల్ప యాత్రలో  చేదోడు   వాదోడుగా ఉండి జగన్ గెలవడానికి ఎంతో సహకారం అందించిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరని తెలుస్తోంది. ఈ విధంగా జగన్ నమ్మిన బంటుగా  నాగేశ్వర్ రెడ్డి ఉంటారట. అంతేకాకుండా ఈయన పక్క నుంటే జగన్ కు చాలా కలిసి వస్తుందని కూడా  జగన్ దగ్గర సన్ని హితులు అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: