కూటమిలో భాగంగా చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ పలువురు బిజెపి నేతలు కలిసి పెద్ద ఎత్తున ప్రచారమైతే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ముందు చాలా పెద్ద బాధ్యతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేమిటంటే ఉత్తరాంధ్రలోని కూటమి చాలా నత్త నడకన నడుస్తోందని.. అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలా చోట్ల కూడా అసంతృప్తులు వినిపించాయి. అయితే ఈసారి భిన్నంగా జనసేన , బీజేపీ పార్టీలకు 9 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంటు సీట్లు ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లు చాలా అసహనాన్ని తెలియజేస్తున్నారు.


అయితే ఈ సీట్లన్నీ కూడా టిడిపికి కంచుకోటగా ఉండేవి. దీంతో కూటమిలో అసంతృప్తి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అంత ఆవేదనతో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలామందికి ఆశించిన సీట్లు రాక కొంతమందికి సీట్లు లేక.. మరి కొంతమంది ఇతర పార్టీలలో చేరి టిడిపిలో కలకలాన్ని రేపుతున్నారు. ఇతర పార్టీల పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటించినంత మాత్రాన అంతా సర్దుకుంటుందని కూటమి పెద్దలు అనుకున్నప్పటికీ కానీ అందుకు రివర్స్ గా రోజుల తరబడి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.


నామినేషన్ల సమయం కూడా దగ్గర పడుతున్న కొద్దీ ముహూర్తం చూసుకొని రెబల్స్ కూడా రంగంలోకి దిగేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కూటమి ప్రచారం కూడా జోరు పెద్దగా అందుకోలేదు.ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా పలు నియోజవర్గాలలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో విశాఖలో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు పర్యటన చేయబోతున్నారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు కూటమి రిపేర్లు చేసి పరుగులు తీయిస్తే తప్ప అక్కడ ఇలాంటి ఇబ్బందులు  అక్కడ ఉండవని నేతలు సైతం తెలియజేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్లు అలక తీర్చి ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలని అక్కడ నేతలు కూడా చంద్రబాబుకు తెలియజేస్తున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: