ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ "సిద్ధం" పేరుతో ప్రస్తుతం బస్సు యాత్రలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా నిన్న జగన్ విజయవాడలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కొంత మంది దుండగులు విజయవాడ లోని వివేకానంద స్కూల్ దగ్గర జగన్ పై రాళ్లూరువ్వారు. ఈ దాడిలో జగన్ కంటిపై, మరికొన్ని చోట్ల గాయాలు అయ్యాయి.

గాయాలు పాలు అయినా జగన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ గాయాన్ని పరిశీలించిన వైద్యులు జగన్ కి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జగన్ పై దాడి జరగడంతో చాలా మంది ప్రముఖులు స్పందించారు. అందులో భాగంగా వైయస్ షర్మిల కూడా స్పందించారు. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ... ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం , దురదృష్టకరం.

ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే.  జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది. ఇలా షర్మిల తన సోదరుడిపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించింది.

ఇక చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికలో జగన్ కి జరిగిన దాడి గురించి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు ఈ దాడిపై స్పందిస్తూ... వైయస్ జగన్ గారిపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సంఘటనపై నిష్పాక్షికమైన విచారణను ప్రారంభించి , బాధ్యులైన అధికారులను శిక్షించాలని నేను అధికారులను అభ్యర్థిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇలా వైయస్ జగన్ దాడిపై చంద్రబాబు నాయుడు, షర్మిల ఇలా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: