తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా భంగపాటకు గురైన బిఆర్ఎస్ పార్టీకి ఇక ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు చుట్టుముట్టింది అన్న విషయం తెలిసిందే. ఒక రకంగా ఈ కేసు అటు బిఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇక ఎంతోమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు అన్న విషయం బయటపడింది. చివరికి గవర్నర్ ఫోన్ కూడా వదలకుండా ట్యాపింగ్ చేశారు అన్న విషయం తెరమీదకి రాగా.. పలువురు పోలీస్ అధికారులు ఈ కేసులో అరెస్టయ్యారు.



ఇక ఈ కేసు అటు బిఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై మాత్రం ఎక్కడా స్పందించడం లేదు. అయితే ఇక ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మరోవైపుకు మళ్లించేందుకు బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొత్త వ్యూహాన్ని పన్నాడు అన్నది తెలుస్తోంది. ఏకంగా బిఆర్ఎస్ పార్టీపై ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రజలు మరిచిపోయేలా సీఎం రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ లోని బట్టి విక్రమార్క సహా మరి కొంతమంది మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తున్నారు కేటీఆర్.


 అయితే ఈ విషయంపై ఎక్కడికి రావడానికి అయినా ఎలాంటి టెస్ట్ చేయించుకోవడానికి అయినా తాను సిద్ధమని లై డిటెక్టర్ ముందు కూడా ఇక నేను ఈ నిజాన్ని ఒప్పుకుంటాను అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇలా తన కొత్త అస్త్రంతో ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టడమే కాదు ఇక బిఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోయేలా చేయాలని అనుకుంటున్నారు   అయితే ఇది ఏకంగా కేటీఆర్ కే రివర్స్ దెబ్బ కొట్టే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన అధికారుల సైతం లై డిటెక్టర్, నార్కో అనాలసిస్ టెస్టులో పాల్గొనే చేస్తే బిఆర్ఎస్ గుర్తుపట్టయ్యే అవకాశం ఉందని.. ఇది కేటీఆర్కే ఎదురుదెబ్బ కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: