ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నేతల పైన వరుసగా రాళ్లదాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం రోజున సీఎం జగన్ మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసురుగా.. నిన్నటి రోజున సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా విసిరారు.. ఇప్పుడు టిడిపి నేత చంద్రబాబు మీద కూడా కొంతమంది ఆకతాయిలు రాళ్లు విసిరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి రాళ్ల దాడిలో జగన్ మాత్రం తీవ్రమైన గాయాల పాలయ్యారు. అదృష్టవశాత్తు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఎలాంటి గాయాలు కాలేదు.


చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజా గళం సభలో ఒక్కసారిగా రాళ్లు విసరడంతో తీవ్ర కలకలం రేపింది. ఎన్నికలలో ప్రచారంలో భాగంగా గాజువాకలో పర్యటిస్తున్న బాబు ప్రసంగిస్తున్న సమయంలో ఒక దుండగుడు ఆయన పైన రాయి విసిరారు.. అయితే చంద్రబాబు ప్రసంగిస్తున్న వాహనం వెనుక నుండి అగంతకుడు రాయి విసిరినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కానీ కాలేదు.. వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ఆ దుండగుడిని పట్టుకొని ప్రయత్నం చేసినప్పటికీ పారిపోయినట్టుగా తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే రాయి విసిరిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. అయితే ఇలా రాయి విసరడం పైన చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.. పోలీసుల వైఫల్యం తోనే ఇలాంటి ఘటన జరుగుతోందంటూ ఆగ్రహాన్ని తెలియజేశారు.. శనివారం రోజున చీకట్లో సీఎం జగన్ పైన గులకరాయ వేశారు. ఇవాళ కరెంటు ఉన్నప్పుడే తనపై రాయి విసిరారు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. అలాగే తెనాలిలో ఉన్న పవన్ మీద కూడా రాళ్లు వేశారు అంటూ తెలిపారు చంద్రబాబు దీని వెనుక గంజాయి, బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ హస్తం ఉన్నట్లుగా కూడా వాళ్ళు రకాల ఆరోపణలు చేశారు.. మరొకవైపు సీఎం జగన్ పైన జరిగిన రాళ్ల దాడికి తమ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ కూడా చంద్రబాబు వారిని విమర్శించారు. రాళ్లు విసిరిన వారందరి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు డిమాండ్ చేస్తున్నానంటూ తెలిపారు. దీంతో అభిమానుల సైతం మొన్న జగన్ నిన్న పవన్ ఈరోజు చంద్రబాబు ఇలా ఎందుకు రాళ్ల దాడి జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: