ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నేతల పైన వరుసగా రాళ్లదాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. శనివారం రోజున సీఎం జగన్ పైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసరగా.. నిన్నటి రోజున ఎన్నికలలో ప్రచారంలో భాగంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి వారాహి యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో సాయంత్రం యాత్ర కొనసాగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి పవన్ పైన రాయి విసిరినట్టుగా వార్తలు వినిపించాయి. ఆ రాయి తగలకుండా సమీపంలో పడినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు పైన కూడా నిన్నటి రోజున ఎవరో గుర్తు తెలియని అగంతకులు వెనక వైపు నుంచి రాళ్లు విసరడం తో తప్పించుకున్నారు.


అయితే పవన్ కళ్యాణ్ పైన రాయి విసిరిన నిందితుడు దొరికారంటూ ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అయితే ఇందులో ఒక సంచలన ట్విస్ట్ బయటపడింది. అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ సభలో రాయి తో దాడి చేసాడని ఒక వ్యక్తిని పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు..అయితే  అది రాయి దాడి కాదని తేలింది. ఆ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించిన తర్వాత తన మాటలలో అసలు విషయం బయటపడింది..


జరిగింది ఏమిటంటే.. అక్కడికి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.. పవన్ కళ్యాణ్ వాహనం దిగగానే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లారట.. ఆ సమయంలో అక్కడ లేడీస్ తో హారతులు పట్టిస్తున్నారు. ఆ అమ్మాయిలను ఇతను తగిలడంతో .. అది చూసిన పెద్దాయన అమ్మాయిలు తరుపున ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఈ వ్యక్తి మీదికి దాడి దిగారట.. అలా ఒకరు కొడుతున్న సమయంలో మరో 10 మంది వచ్చి ఈ వ్యక్తి పైన చేయి చేసుకున్నారట. చివరికి ఏంటయ్యా అంటే రాయి వేశారంటూ పదే పదే చెప్పడంతో  అక్కడున్న వారందరూ అతడిని చితకబాదినట్టు కనిపిస్తోంది. అలాగే జగన్ పైన కూడా రాయి దాడి జరగడంతో ఇతడు కూడా రాయి వేసాడు అని ప్రచారం చేయడంతో అందరూ కలిసి ఇతని మీద పడి కొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే అతను పోలీసులతో ఇదంతా చెప్పినట్లు తెలుస్తోంది. మరి అతను వైయస్సార్ కార్యకర్త అవునో కాదో మరో కొద్ది రోజులలో తెలియనంది.. కేవలం పవన్ కళ్యాణ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లడంతో తనను రాయి వేసిన వ్యక్తిగా వెనుక నుంచి కేకలు వేయడంతో ఇలా జరిగిందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: