•హిందూపురంలో నిలిచేది నేనే.. గెలిచేది కూడా నేనే - పార్థసారథి
•నేను బళ్లారిలో పుట్టినా..ఆంధ్ర నాకు మెట్టినిల్లు - జే. శాంతమ్మ
•ఇద్దరి చూపు ఆ వర్గం వైపే..


(హిందూపురం - ఇండియా హెరాల్డ్)
ప్రస్తుతం అనంతపురంలో టిడిపి రాజకీయం మంటల్లో ఉంది.. అత్యంత కీలకమైన హిందూపురం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సత్య సాయి బాబా, ఎన్టీ రామారావు.. టిడిపి ఆవిర్భవించిన తర్వాత బీసీలకు నిలవైన హిందూపురాన్ని టిడిపి కంచుకోటగా మార్చుకుంది. గత ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి నేర్చుకున్న పాఠాలతో మళ్ళీ పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది.. దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించిన నీలం సంజీవరెడ్డి ఎంపీని చేసిన ఘనత హిందూపురం నియోజకవర్గానికి దక్కుతుంది. ముఖ్యంగా టిడిపి ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు ఓటర్ల రూపంలో అధికంగా ఉన్న బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో భాగంగా.. హిందూపురం పార్లమెంటు స్థానంలో ఏడు శాసనసభ స్థానాల్లో ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వగా.. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు,  బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరు బరిలోకి దిగుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి  ఒక సామాన్య డాక్టర్ కి అవకాశం కల్పించింది. ఇక పార్లమెంటు నియోజకవర్గం కేంద్రమైన హిందూపురం అసెంబ్లీ స్థానంలో కురబ సామాజిక వర్గానికి చెందిన టిఎన్ దీపికను.. టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై పోటీకి దించుతున్నారు. పుట్టపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి పై టిడిపి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,  ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి పోటీ చేస్తున్నారు.

మరోవైపు కదిరి అసెంబ్లీ స్థానం నుంచి మక్బూల్ అహ్మద్ పోటీ చేస్తుండగా.. టిడిపి నుంచి కందికుంట వెంకటేశ్వర ప్రసాదు.. రాప్తాడు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై మాజీ మంత్రి పరిటాల సునీత పోటీకి దిగారు.. ఇక కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బదిలీపై వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుండగా.. ఈమెకు పోటీగా మాజీ మంత్రి కుమార్తె సవితమ్మ పోటీకి దిగుతున్నారు.. మరొకవైపు మడకశిర ఎస్సీ రిజర్వుడ్ క్యాండిడేట్గా ఈరలక్కప్పను ప్రకటించారు.. అలాగే టిడిపి అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సామాన్య డాక్టర్ ఎం బి సునీల్ కుమార్ కు టిడిపి తరఫున అవకాశం లభించింది.

హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెనుగొండ నియోజకవర్గం నుంచి బీ.కే.పార్థసారథి.. 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఓడిపోయారు. పెనుగొండ నుంచి టికెట్ ఆశించిన ఆయన భంగపడ్డారు.. అంతటితో ఊరుకోకుండా ఆగ్రహంతో టిడిపి ప్రచార సామాగ్రిని దహనం చేశారు ..అలాగే చంద్రబాబు తీరును ప్రశ్నిస్తూ.. హిందూపురంలో నిలిచేది నేనే.. గెలిచేది కూడా నేనే..అనే  నినాదంతో ధీమా వ్యక్తం చేశారు.. పెనుగొండ నియోజకవర్గంలో పరిస్థితి అదుపు తప్పకుండా చూడాలని బికే పార్థసారథి అభ్యర్థిత్వాన్ని హిందూపురం పార్లమెంటు స్థానంలో ఖరారు చేశారు.. ఇదే ఆయనకు తొలి విజయమని పార్టీ వర్గాలే కాదు విమర్శకులు కూడా భావిస్తున్నారు.. మరొకవైపు 1999 ఎన్నికల్లో కూడా బీకే పార్థసారథి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈయనకు ఈ నియోజకవర్గంలో పూర్తి అవగాహన పట్టు ఉన్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఆదరిస్తారని విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరోవైపు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి వైఎస్ఆర్సిపి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా జల దాసరి శాంతమ్మ తెరపైకి వచ్చారు.. బళ్లారి ఎంపీగా ఈమె ఒకసారి గెలిచారు కూడా.. అలాగే ఓటమి చెందారు.. శాంతమ్మ ను ఎంపీ అభ్యర్థిగా తీసుకురావడం వెనుక ఆమె సోదరుడు శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి మంత్రాంగం ఉందనే విషయం పై చర్చ కూడా జరుగుతుంది.. నేను కూడా లోకల్ .. నాకు ఈ ప్రాంతం పై అవగాహన ఉంది.. వాల్మీకి సామాజిక వర్గం నుంచి నాకు బంధుత్వం ఉంది అంటూ శాంతమ్మ చెబుతోంది.. నేను బళ్లారిలో పుట్టినా.. నా వివాహం గుంతకల్లు వ్యక్తితో జరిగింది.. కాబట్టి ఆంధ్ర నాకు మెట్టినిల్లు అని తాను చెబుతోంది.. ఇక నియోజకవర్గంలో బీసీ సామాజిక ఓటర్ల పై ఆశలు పెట్టుకున్న ఈమెకు సిట్టింగ్ ఎమ్మెల్యేలే పెద్ద రక్ష.. అందులో ప్రధానంగా వైయస్సార్సీపీ పేదల పార్టీ.. ఆ వర్గాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలే తనకు శ్రీరామరక్ష అంటూ ఎంపీ అభ్యర్థి జల దాసరి శాంతమ్మ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఇలా అటు బికె పార్థసారథి ఇటు జల దాసరి శాంతమ్మ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గ ఓటర్ల పై ఆధారపడుతున్నారు.  మరి ఎవరికి ప్రజలు పట్టం కడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: