ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం నాడు రాత్రి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాడి ఒరిజినల్ ని కూడా నిర్ధారించారు. జగన్ తనంతట తానే ఆ దాడి చేయించుకోలేదని కేవలం ఆగంతకులు చేసిన పని అని ప్రతిపక్ష నేతలు ఇద్దరు వారి చర్యల ద్వారా నిరూపిస్తున్నారు. దీనికి కారణం ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ సభల్లో రాళ్లదాడులు  ఓవరాక్షన్ చేయడం ఆ పార్టీలకు నష్టాన్ని తీసుకువచ్చింది. ఇకపోతే వీరిద్దరి సమీపాలకు కూడా ఆ రాళ్లు రాకపోవడంతో ఇదంతా కేవలం స్క్రిప్ట్ ప్రకారమే చేస్తున్నదన్న అభిప్రాయాన్ని కూడా వారు కలిగేలా చేశారు.


ఇకపోతే ఈ విషయంలో ప్రజలు జగన్ కు అయినట్టే రక్త గాయాలు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కి కూడా కావాలి కదా అన్న ప్రశ్నకు దారితీస్తుంది. అదేమో తెలియదు కానీ.. వారిద్దరి కూడా ఏదో జరిగిపోయింది అనే ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా సిద్ధంగా ఉంటుంది. కాకపోతే అది నిజం అని నమ్మడానికి మాత్రం ప్రజలు సిద్ధంగా లేరు. ఇక జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడి అంటే తమపై కూడా రాళ్ల దాడి జరిగిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇక ముఖ్యమంత్రి పై జరిగిన ఘటన డ్రామా అంటున్నా ఈ పెద్ద మనుషులు తమను ఎలా చూస్తారని తెలివి కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


ఇక పాత గాజువాక జంక్షన్ లో చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభలో గుర్తుతెలియని ఆగంతకుడు కూడా రాయి విసిరాడు. అయితే ఈ విషయంలో రాయి చంద్రబాబుకు తగలకుండా వాహనానికి ముందున్న ఇనుప బారికేడ్ కి తగిలి కింద పడిపోయింది అంట. అయితే ఈ విషయంలో రాయి శబ్దం ఎక్కువగా రావడంతో చంద్రబాబు భద్రత సిబ్బంది అక్కడ ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారని ఎన్నో కథలను పరిష్కారం చేసింది ఎల్లో మీడియా.


ఇక ఇది ఇలా ఉండగా గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర పై కూడా రాయి వేసినట్టు జనసేన నాయకులు తెలిపారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అదృష్టం బాగుండి రాయి అతడికి తగలకుండా పక్కకు వెళ్లి పోయిందట. ఇకపోతే ఈ సంఘటనలో రాయి విసిరిన యువకుడిని పవన్ కళ్యాణ్ అభిమానులు పోలీసులకు అప్పగించారు. కాకపోతే ఆ రాయి ఎవరూ తగలలేదని పోలీసులు చెప్పడం నిజంగా గమనార్హం. ఇలా చేయడం ద్వారా అసలు ప్రజలు వారిపై ఎలా ముందుకు వెళ్తారు, ఎలా ఆలోచిస్తానని విషయం కూడా ఆలోచించకుండా రాజకీయ నాయకులు ఇలా చేయడం సబబుగా అనిపించట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: