ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం సభ యాత్రలో భాగంగా శనివారం రోజున విజయవాడకి చేరుకున్నారు.. అయితే ఆ యాత్ర కొనసాగిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు రాజకీయాలలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది.. ఈ విషయం పైన ప్రధాన మంత్రి మోడీతోపాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక నేతలు కూడా ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. ఇలాంటి సమయంలోనే చాలామంది టీడీపీ నేతలు కూడా ఎన్నో రకాల సందేహాలను కూడా తెలియపరుస్తున్నారు.


సీఎం జగన్ పైన దాడిలో పలు రకాల అనుమానాలు ఉన్నాయని.. కావాలని సానుభూతి కోసమే వారే దాడి చేయించుకున్నారు అంటూ పలు రకాల కామెంట్లను టిడిపి నేతలు ఆన్లైన్ , ఆఫ్ లైన్ వేదికగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ కూడా పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ .. గాయమైన మూడు గంటల వరకు హాస్పిటలకు ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నించారు.. ఆ సమయంలో దండ వేస్తుంటే అక్కడ ఉండే బైండింగ్ వైర్ తనకు గీసుకుందని ఆ గాయమే అది అన్నట్టుగా తెలిపారు చింతమనేని ప్రభాకర్.


ఈ గాయం మీద కోపంతో జగన్ మోచేతితో బెల్లంపల్లి శ్రీనివాస్ ను గుద్దితే గాయమైనట్టుగా కొన్ని వర్గాలు చెబుతున్నాయి అంటూ చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. వీటన్నిటికీ కచ్చితంగా సమాధానం చెప్పాలి అని తెలిపారు. ఒకవేళ నిజంగానే జగన్ కి రాయి దెబ్బ తగిలితే అక్కడ వాపు రావాలి బొప్పి కట్టాలి అంటూ చింతమనేని తెలిపారు.. ఇదంతా కోడి కత్తి డ్రామా అంటూ తెలిపారు. రాయి దెబ్బ తగిలితే ఒకచోటే తగలాలి కానీ మూడు విధాలుగా గీసుకున్నట్టుగా ఉందంటూ వెల్లడించారు. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి  డైరెక్షన్ లోనే జరిగిందంటూ.. దీని ఫలితంగానే సింపతి పొందాలని చూస్తున్నారంటూ చింతమనేని పలు రకాల వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: