ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో దాడి  జరిగిన విషయం తెలిసిందే..సీఎం పై దాడి ఉదంతాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.జగన్ కి వ్యక్తిగత భద్రతను పెంచేలా తక్షణ చర్యలకు దిగింది. ప్రస్తుతం వున్న భద్రతకు అదనంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ రంగంలోకి దించనుంది.మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విజయవాడకు చేరుకున్న జగన్‌పై వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు.ఈ ఘటనలో  ఆయన గాయపడ్డారు. ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు.ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీస్తుంది.. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలను కూడా తెప్పించుకుంది. జగన్ కి భద్రతను పెంచాలని ఆదేశించింది. జగన్ బస చేసే నైట్ క్యాంప్‌కు సీఐఎస్ఎఫ్‌తో భద్రత కల్పించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది ఇచ్చింది. దీనికి అనుగుణంగా డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం జగన్ బస చేస్తోన్న నైట్ క్యాంప్‌లకు ఆక్టోపస్ బలగాలు మరియు పోలీసులను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అదనంగా సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపయోగించనున్నారు. నేటి నుంచే ఈ బలగాలు వైఎస్ జగన్ నైట్ క్యాంప్‌ భద్రతను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి.అయితే గాయం కారణంగా జగన్ ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు  ఆదివారం బస్సుయాత్రకు విరామం ఇచ్చారు. సోమవారం యధాతథంగా బస్సు యాత్ర ప్రారంభం అయింది.. సోమవారం ఉదయం ఉదయం 9 గంటలకు కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్‌, హనుమాన్ జంక్షన్ మరియు పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకున్నారు..ఆ తరువాత జొన్నపాడు, జనార్ధణపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.. ఆ తరువాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్ మరియు పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: