బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు అయినటువంటి హరీష్ రావు మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలను చేస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా హరీష్ రావు ఓ సభలో మాట్లాడుతూ మరోసారి కాంగ్రెస్ పార్టీపై తనదైన రీతిలో రెచ్చిపోయాడు.

తాజాగా హరీష్ రావు మాట్లాడుతూ ... మరి కొన్ని రోజుల్లో మన రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఆయన గతంలో డిసెంబర్ 9 న ఆడే రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాడు. ఆ మాట తప్పినందుకు సీఎం రైతులకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని హరీష్ అన్నారు.

రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన పోరాటానికి రేవంత్ భయపడ్డాడు. దానితో వెంటనే రేవంత్ ఈ ప్రకటన చేశారు. ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పార్టీ అధికారంలోకి వచ్చి చాలా రోజులు అవుతుంది ఇంకా ఎందుకు ఇవ్వలేదు అని హరీష్ ప్రశ్నించాడు. వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని అన్నారు. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు..? మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు 2500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ హామీ ఎటు పోయింది.  నెలకి 4 వేలకు పెంచుతామన్న పెన్షన్ను ఎప్పుడు పెంచి ఇస్తారు..?ఇచ్చిన హామీలను అమలు చేసే సిద్ధ శుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోతామని భయంతోనే మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీపై నమ్మకం కోల్పోయారు అని మీరు మళ్ళీ ఎన్ని హామీలను ఇచ్చిన జనాలు మీకు ఓటు వేయరు అని హరీష్ తాజా సభలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: