వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నాయకులు జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిపై ఉన్న క్రిమినల్ కేసుల కారణంగానే కటకటాల పాలయ్యే సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. వారిలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మండపేట ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒకరు. అప్పట్లో టీడీపీలో ఉన్న సమయంలో త్రిమూర్తులు ఒక శిరో ముండనం కేసులో ప్రధాన నిందితుడు అయ్యారు. ఆ సమయంలో టీడీపీలో ఉన్న ఆయనను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.

1996, డిసెంబరు 29న బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి గుండు చేయించారు. ఈ శిరో ముండనం కేసులో మొత్తం తొమ్మిది మందిపై అభియోగాలు మోపారు. ఈ తొమ్మిది మందిలో ప్రధాన నిందితుడిగా తోట త్రిమూర్తులు ఉన్నారు. ఈ కేసు ఎట్టకేలకు క్లోజ్ చేసే సమయం ఆసన్నమైంది. ప్రత్యేక కోర్టు శుక్రవారం రోజు ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. ప్రస్తుతానికైతే కోర్టు త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. అలానే బెయిల్ మంజూరు చేస్తూ పై కోర్టుకు అప్లై చేసుకునే అవకాశాన్ని అందించింది.

త్రిమూర్తులు వైజాగ్ నుంచి ఈ కార్యకర్తలతో కలిసి మండపేటకు బయలుదేరారు. ఈ తీర్పు వచ్చినా సరే ఏం భయం లేదని, తనకేం కాదని ఆయన తన పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారులకు భరోసా ఇచ్చారు. 2024 మండపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను కచ్చితంగా గెలిచి తీరుతానని ధైర్యం కూడా చెప్పారు.

వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జైలుకు త్వరలోనే వెళ్ళే అవకాశం ఉంది. ఆయనకు కోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని మరో నిందితుడు దస్తగిరి ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. ఆ పిటిషన్ పై వాదనలు వినిపించడం పూర్తయింది. ప్రస్తుతానికి తీర్పును రిజర్వ్ చేశారు. ఆ తీర్పులో ఏమని ఉందో అదే అవినాష్ రెడ్డి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: