ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరుకుంది  ఈసారి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడనే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పావులు కదుపుతూ ఉన్నాయి అని చెప్పాలి.. అయితే మొత్తంగా తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉండగా 16 స్థానాల్లో విజయం మాదే అనే చెప్పుకుంటున్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.


 అయితే ఒక్క హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం గెలుపుపై ఆశలను వదిలేసుకున్నాయ్ టాక్ ఉంది. అక్కడ తమ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిని నిలబెట్టాయి అనే వాదన కూడా ఉంది. ఇలా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం కంచుకోటలో నామమాత్రమైన పోటీ మాత్రమే చేస్తూ ఉంటే.. అటు బిజెపి మాత్రం మజిలీస్ పార్టీని దెబ్బ కొట్టి హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఓవైసీ ని దెబ్బ కొట్టేందుకు బలమైన అభ్యర్థి మాధవి లతను బరిలోకి దింపింది. అయితే హిందుత్వవాది అయిన మాధవి లత అటు మజిలీస్ కంచుకోటలో అడుగుపెట్టి ఆ పార్టీకి సరైన పోటీ ఇవ్వగలరా లేదా అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది.


కాగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కువగా ముస్లిం ఓటర్లే ఉన్నారు. అయితే వారిని బుజ్జగించే ప్రయత్నం చేయకుండా.. తనను గెలిపిస్తే ఏం చేస్తాను అనే విషయాన్ని స్పష్టమైన హామీలు ఇస్తున్నారు బిజెపి అభ్యర్థి మాధవి లత. మరి ముఖ్యంగా త్రిబుల్ తలాక్ విషయంలో మహిళలకు న్యాయం చేస్తాను అంటూ హామీ ఇస్తున్నారు.  అంతేకాదు వక్ఫ్ బోర్డులో ఆక్రమించుకున్న భూములను విడిపించే బాధ్యత నాది అనే హామీ ఇస్తున్నారు. ఇలా ఆక్రమణకు గురైన ముస్లింలతో పాటు హిందూ భూములను కూడా విడిపిస్తాను అంటూ చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు వరకు ఎంతోమంది అక్కడి నుంచి పోటీ చేసినప్పటికీ.. ఇలాంటి హామీలు మాత్రం ఇవ్వలేదు. అటు మాధవి లత మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా.. భయం అనే మాటే లేకుండా తనను గెలిపిస్తే ఏం చేస్తానో అనే విషయంపై హామీలు ఇస్తూన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మజిలీస్ కంచుకోటని బద్దలు కొట్టేలాగా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: