- చీరాల‌లో ' ఆమంచి ' సొంత బ‌లమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందా..!
- ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండ‌డంతో మారిన సీన్‌
- 2014లోనే సొంత బ‌లంతో ఇండిపెండెంట్‌గా గెలిచిన నేత‌

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్రంలో మ‌రోసారి త‌న హ‌వాను చ‌లాయించాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్ప‌టికే దూకుడు పెం చింది. రాష్ట్ర వ్యాప్తంగా 114 మంది అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. వీరిలో కొంద‌రు బ‌ల‌మైన నాయ‌కులు కూ డా ఉన్నారు. మాజీ మంత్రుల‌కు కూడా పార్టీ టికెట్‌లు ఇచ్చింది. అయితే.. ఎక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన పోటీ ఇచ్చే దిశ‌గా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఉదాహ‌ర ణ‌కు క‌డ‌ప నుంచి పోటీ చేస్తున్న ష‌ర్మిల‌.. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల‌పైనా ప్ర‌భావం చూపించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.


ఈ జాబితాలోనే ఇప్పుడు మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కూడా చేరింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అదే.. ఉమ్మడి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గం. ఇది ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. 2009 వ‌ర‌కు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం కొన‌సాగింది. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌.. త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే.. ఇప్పుడు మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి పుంజుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం కేవ‌లం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.


వైసీపీలో ఆయ‌న‌కు జ‌రిగిన అవ‌మానం నేప‌థ్యంలో ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీ చీఫ్ ష‌ర్మిల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. రేపో మాపో ఆయ‌న పార్టీలో చేర‌డం కూడా ఖాయ మైంది.ఇక‌, ఆయ‌న‌కు పార్టీ చీరాల టికెట్‌ను కేటాయించ‌డం కూడా ఖాయ‌మైంది. అయితే.. రాష్ట్రంలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. ఇక్క‌డ‌కు చాలా వ్య‌త్యాసం ఉంది. గ‌త ఐదేళ్లుగా ఆమంచి ప్ర‌జ‌ల‌కు చేరువ గా ఉండ‌డం.. ముఖ్యంగా బ‌ల‌మైన మ‌త్య్స‌కార, ప‌ద్మ‌సాలీ, ఇత‌ర బీసీ వ‌ర్గాల్లో, ఇటు ఎస్సీ, ఎస్టీల్లోనూ ఆమంచికి తిరుగులేని ప‌ట్టు ఉండ‌డం వంటివి.. కూడా ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్నాయి.


అన్నింటికి మించి ముస‌లికి మ‌డుగులో ఎంత బ‌లం ఉంటుందో.. అదే బ‌లం ఆమంచికి చీరాల‌లో ఉంటుంది. 2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి భ‌యంక‌రంగా టీడీపీ కూట‌మి వేవ్ ఉన్నా ఆమంచి చీరాల‌లో ఏకంగా 10 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇది ఆయ‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాకు నిద‌ర్శ‌నం. ఈ నేప‌థ్యంలో ఆమంచి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేర‌డంతో ఏపీ మొత్తం మీద‌ కాంగ్రెస్ పార్టీకి మంచి హోప్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఏదైనా ఉంటే.. అది చీరాలేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


గ‌తంలోనూ ఆమంచి ఇక్క‌డ కాంగ్రెస్‌ నుంచి విజ‌యం ద‌క్కించుకుని ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు పార్టీ కార్య‌క‌ర్త‌లు కొత్త‌కాదు.. నాయ‌కులు కొత్త‌కాదు. పైగా ఈ సారి హ‌స్తం గుర్తు కూడా బాగా ప్ల‌స్ అవుతోంది. ఆమంచి ఎప్పుడు అయితే చీరాల‌లో పోటీ చేస్తున్నార‌న్న టాక్ వ‌చ్చిందో చీరాల రాజ‌కీయం ఒక్క‌సారిగా మారిపోయింది. త్రిముఖ పోరు ఖాయ‌మైంది. పైగా ఆమంచికి గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందార‌న్న సానుభూతి కూడా ఆమంచికి క‌లిసి వ‌స్తోంది. సో.. ఎలా చూసుకున్నా కాంగ్రెస్‌కు ఏపీ మొత్తం మీద హోప్ ఉన్న ఫ‌స్ట్ సీటు ఆమంచేన‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: