ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణలోని 17 స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎప్పటి లాగానే విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అటు ప్రతిపక్ష బిజెపి పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని కూలిపోతుంది అంటూ గతంలో బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ నేతల మధ్య ఐక్యత దెబ్బ తినడం కారణంగా నేను సీఎం అంటే నేను సీఎం అంటూ పోట్లాడుకోవడం కారణంగా ప్రభుత్వం కూలిపోతుంది అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అన్న విషయం అందరికీ అర్థమైంది.


 అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ కీలక నేతలు కేసిఆర్, కేటీఆర్, హరీష్ లు వివిధ సమావేశాల్లో కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త కారణాన్ని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే బిజెపిలో చేరబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతుంది. సాధారణంగా రాష్ట్రస్థాయిలో ఎదగాలి అనుకున్న ఒక రాజకీయ నాయకుడికి ఉన్నతమైన పదవి ఏది అంటే మంత్రి పదవి. కానీ రేవంత్ కి మంత్రి పదవి చేపట్టకుండానే నేరుగా సీఎం సీట్ లోనే కూర్చునే అవకాశం వచ్చింది. ఇలా ఇలా సీఎంగా బాధ్యతలు చేపట్టేలా వచ్చిన అదృష్టాన్ని రేవంత్ ఎందుకు వదులుకుంటాడు.. రేవంత్ బీజేపీలో చేరుతున్నాడు అంటూ బిఆర్ఎస్ నేతలు చేస్తున్నవని తప్పుడు ఆరోపణలే అని మొన్నటి వరకు తెలంగాణ ప్రజలు అనుకున్నారు.


 కానీ హరీష్ రావు, కేటీఆర్, కెసిఆర్ బల్లగుద్ది మరి రేవంత్ త్వరలో బిజెపిలో చేరబోతున్నాడని అక్రమ కేసులకు భయపడి ఇలా చేయబోతున్నారంటూ సంచలన  వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు అందరితో కలిసి రేవంత్ బిజెపిలో చేరబోతున్నాడని కేటీఆర్ అంటుంటే.. కేసులకు భయపడి రేవంత్ కమలం పార్టీలోకి వెళ్ళబోతున్నాడని హరీష్ ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వం కూలిపోతుంది.. తన సీఎం పదవి పోతుంది అని తెలిసి రేవంత్ కాషాయ కండువా కప్పుకోబోతున్నాడు అంటూ  కెసిఆర్ ఆరోపిస్తున్నారు. అయితే ఇంత బల్లగుద్ది మరి చెబుతున్నారంటే వీరు చెప్పే మాటల్లో ఎంతో కొంత నిజం ఉంటుందనే చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో మొదలైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: