ఆంధ్రప్రదేశ్లోని చాలామంది రాజకీయ నాయకుల తలరాతలను మార్చేశాయి 2019 అసెంబ్లీ ఎన్నికలు.. అసలు జీవితంలో గెలుస్తామా అసెంబ్లీ గేటు దాటుతామ అని అనుకున్న చాలామంది చేత అధ్యక్ష అనిపించేలా చేశాయి. అలాగే ఇక్కడ మనకు తిరిగేముంది మనమల్ని ఓడించే మొనగాళ్లు ఎవరంటూ అనుకున్న బ్యాచ్కు సైతం ఓటమి టేస్ట్ ఎలా ఉంటాయో చూపించాయి 2019 ఎలక్షన్స్.. అలా ఓడిపోయిన సీనియర్స్ కు ఈసారి ఎన్నికలలో ఛాలెంజ్గా మారాయి. అందుకే గతంలో జరిగిన తప్పులను సైతం మళ్లీ రిపీట్ కాకుండా చేసుకుంటున్నారు నాయకులు.


అలా ఈసారి పక్కా ప్లాన్ తో అడుగులు వేయాలనుకుంటున్న వారిలో పరిటాల కుటుంబం కూడా ఒకటి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పరిటాల రవి తర్వాత ఆయన భార్య సునీత ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి వరుసగా మూడుసార్లు గెలిచింది.. రాష్ట్రం విడిపోయిన తర్వాత మంత్రి అయింది పరిటాల సునీత. కానీ 2019 ఎన్నికలు మాత్రం పరిటాల కుటుంబానికి ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది.. ఎందుకంటే పరిటాల రవి వారసుడు శ్రీరామ్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీపడ్డారు.


అంతకుముందు శ్రీరామ్ తల్లి సునీతమ్మ ప్రాతినిధ్యం వహించిన రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు శ్రీరామ్.. అప్పటికే జగన్ వేవ్ ఎక్కువగా ఉండడంతో పాటు..వరుసగా ఓటమి కారణం చేత ప్రకాశ్ రెడ్డి పైన సానుభూతి పెరగడంతో పరిటాల శ్రీరామ్ కు ఓటమి తప్పలేదు అనేది నాటి విశ్లేషణ.. గతంలో ఎన్నడు లేనివిధంగా పరిటాల రవి కుటుంబం ఓటమి ఎదుర్కొంది. అలా ఉలిక్కిపడిన ఈ కుటుంబం ఇప్పుడు ఒక్కసారిగా రిపేర్లు చేయడానికి సిద్ధమయ్యింది.


ధర్మారం టికెట్ ఆశించినప్పటికీ శ్రీరామ్ కు అక్కడ దక్కలేదు. పొత్తులో భాగంగా సత్యకుమార్ సీటు బిజెపి పార్టీకి ధర్మారానికి వచ్చింది.. ఎలాగైనా తనను గెలిపించాలని ఆ బాధ్యతలు శ్రీరామ్ తీసుకున్నారు. ఈసారి రాప్తాడు నియోజకవర్గం లో పూర్తిగా వ్యూహాలను మార్చేస్తున్నారు పరిటాల కుటుంబం. కుటుంబ పాలన ముద్ర చాలా బలంగా అక్కడ నియోజకవర్గంలో పడడం వల్లే రాప్తాడులో వీరికి వ్యతిరేకంగా మారిందట. దీనివల్లే ఓటమిపాలు అయ్యామని గుర్తించడంతో.. అందులో పరిటాల సునీత సోదరులు ఇతర కుటుంబ సభ్యుల పెత్తనం కారణం చేత.. సునీతమ్మ నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత వచ్చిందనే అంచనా తో ఈసారి వాళ్లందరిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది.


దీంతో సొంతంగా ఆమె దగ్గరుండి మరి పార్టీని నడిపిస్తోందట. శ్రీరామ్ కూడా అటు ధర్మవరం మీద ఫోకస్ పెడుతూనే రాప్తాడు మీద కూడా పెట్టినట్లు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. తమ నియోజకవర్గంలో బీసీలు అందరూ కూడా వైసిపివైపు వెళ్లినట్లుగా గుర్తించిన సునీత.. ఈసారి వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. అలా 2019లో ఇచ్చిన షాక్ తో ఈసారి రెండు నియోజకవర్గాలలో కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు పలువురు పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: