ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి ఆయనపై  ముప్పేట దాడి చేసినా   కొంచెం కూడా వణుకు, బెరుకు లేకుండా తను అనుకున్నదే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓ వైపు టీడీపీ , మరోవైపు జనసేన, ఇంకోవైపు బిజెపి ఇలా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్ ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు సొంత కుటుంబం నుంచే షర్మిల,సునీతలు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి వ్యతిరేక ప్రచారాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ జగన్ మాత్రం వారు చేసిన నెగిటివ్ కామెంట్లు అన్నీ పాజిటివ్ గా మలుచుకుంటూ  సింపతీ రాజకీయం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇదే తరుణంలో జగన్ పై కేంద్రం కూడా కన్నెర్ర చేస్తోంది. అందుకే ఆ అధికారులను బదిలీ చేయబోతోంది. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. 

ప్రస్తుతం రాష్ట్రమంతా ఎన్నికల సంఘం చేతిలో ఉంది. ఎన్నికల సంఘం కేంద్రం చెప్పినట్టు చేస్తుంది.  జగన్ కి  పాజిటివ్ గా ఉండే ఏ ఒక్క అధికారిని కూడా ఎన్నికల సంఘం వదిలిపెట్టడం లేదు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలంటే ఆ ఎనిమిది మంది అధికారులను బదిలీ చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేశారట. ఈ ఫిర్యాదును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వంలో చేశారట. ఫిర్యాదు చేసిన వారిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ కనకమేడల రవీంద్ర కుమార్, జనసేన ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్, బిజెపి మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బిజెపి జాతీయ మీడియా సహ ఇంచార్జ్  సంజయ్ మయుక్ లు, సిఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు  సుబ్బిర్ సింగ్, సంజులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారట.

 ఇందులో ముఖ్యంగా చూసుకుంటే..చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డిజిపి  రాజేంద్రనాథ్ రెడ్డి,  ఐజిపి కొల్లు రఘురాం రెడ్డి, మరో ఐదుగురు అధికారులను బదిలీ చేయమని చెప్పి వీరు  కోరుతున్నారట. ఈ అధికారులనే స్పెషల్ గా బదిలీ చేయించడానికి కారణం రెడ్డి వర్గం అని చెప్పి జగన్ కు వారు విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారట. వారు అధికారులు అనేది మరిచిపోయి సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర నాయకులు ఫిర్యాదు చేయడంతో  వారందరిని బదిలీ చేసి జగన్ కి షాక్ ఇవ్వాలని చూస్తోంది ఎన్నికల సంఘం. ఈ తతంగం అంతా చూస్తే మాత్రం  జగన్ పై వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ ను తట్టుకోలేక ఎలాగైనా ఆయన్ని దెబ్బ కొట్టాలని ఈ విధమైన ప్లాన్లు వేస్తున్నారని  కొంతమంది జగన్ అభిమానులు అంటున్నారు. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూ జగన్ అంటే ఎంత భయం ఉందో వారికి వారే వ్యక్తపరచుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: