ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడి కేసులో సతీష్ కుమార్ అలియాస్ సత్తి అనే మైనర్ బాలుడు ప్రధాన నిందితుడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. బుధవారం సాయంత్రం పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాస్తవాలను వెల్లడిస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజమని తేలిపోయింది.
 
అయితే జగన్ పై దాడి కేసులో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని అందువల్లే పోలీసుల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందడం లేదని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి బోండా ఉమ పేరు ఎక్కువగా వినిపిస్తుండగా ఆయన మాత్రం ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే వేర్వేరు సందర్భాల్లో బోండా ఉమ ఇచ్చిన పొంతన లేని స్టేట్ మెంట్లు ఆయనకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయని తెలుస్తోంది.
 
అయితే పోలీసులు స్పందిస్తే మాత్రమే ఈ కేసుతో బోండా ఉమకు సంబంధం ఉందో లేదో తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వివరాలను లీక్ చేస్తే అసలు నిందితులు తప్పించుకునే ఛాన్స్ ఉందని పోలీసులు సైలెంట్ గా ఉన్నారనే కామెంట్లు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది.
 
టీడీపీ నేతలదే తప్పని తేలితే మాత్రం ఈ ఎన్నికల్లో చంద్రబాబు రాయిదాడికి  తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మాత్రం బహిరంగ సభల్లో తనపై జరిగిన దాడిని జగన్ ఖండించలేదని జగన్ గులకరాయి డ్రామా ఆడుతున్నాడని చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతుండగా ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో చూడాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని చంద్రబాబు, జగన్ చెబుతున్నా అసలు ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరో 50 రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: