షర్మిలకి ఏపీలో ఓట్లు రాలడం కష్టం అని తెలుస్తుంది. ఎందుకంటే తన ప్రసంగాల్లో పాడిందే పాట పాడుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. షర్మిల అంటే.. అభిమానం ఉన్నా కానీ కొన్ని విషయాల్లో ఆమెతో విభేదిస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. కేవలం తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను ఒక్క దాన్నే టార్గెట్ చేసుకుంటే.. పార్టీ ఎదగదని.. ఆమెకు పదే పదే చెబుతున్నారు.దీంతో షర్మిల పంథా మార్చినా.. కొత్త సంగతులు.. కొత్త విషయాలు ఎక్కడా కూడా ప్రస్తావించడం లేదు. కేవలం హోదా గురించి పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు, జగన్‌లు బీజేపీ తొత్తులని షర్మిల అంటున్నారు. ఈ రెండు పార్టీలకూ ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ఆమె అంటున్నారు. ఇవన్నీ.. ఆమె పదే పదే చెబుతుండడంతో సభలకు వచ్చిన వారు ఎవరూ కూడా ఎక్కువ సేపు నిలవడం లేదు. కేవలం ఐదు పది నిమిషాల్లోనే ఆమె సభలు పలచబడుతున్నాయి. దీంతో జనాలను ఆకట్టుకోలేక నాయకులు తలపట్టుకుంటున్నారు.


గత రెండు మాసాల నుంచి షర్మిల.. ఎక్కడ ప్రసంగించినా కానీ సీఎం జగన్‌పైనే విమర్శలు చేశారు. ఆయనపై తీవ్రస్తాయిలో రెచ్చిపోయారు. ఇవి ఓ వర్గం మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి అయితే.. ఎన్నికల సమయం వచ్చే సరికి.. ఆమె మరో రెండు పార్టీలను కూడా టార్గెట్‌ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో మీడియా ఫోకస్ మొత్తం కూడా తగ్గిపోయింది. పైగా.. కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లు.. సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం లేదని.. ఆయనపై మరింత సింపతీ పెరుగుతుందని సూచించారు.దీంతో ఏమనుకున్నారో ఏమో కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తగ్గించినా  కూడా పదే పదే చెప్పిందే చెబుతున్నారు. అందువల్ల ప్రజల నుంచి ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. నామినేషన్ల ఘట్టం ప్రారంభానికి ముందు.. తర్వాత.. ఎన్నికల ప్రచారంలో తేడా అనేది ఉంటుంది. అప్పటి దాకా ఎలా ఉన్నా కూడా ఈ 25 రోజులు మాత్రం చాలా కీలకం. ఈ సమయంలో ఓటు బ్యాంకును ఖచ్చితంగా ఆమె ప్రభావితం చేసుకోవాలి.కానీ ఈ దిశగా మాత్రం షర్మిల ప్రిపేర్ అయినట్టు కనిపించడం లేదు. దీంతో షర్మిల సభలకు వచ్చేవారు తగ్గిపోయారు. ఇక తన పద్ధతి మార్చకుంటే ఆమెకి ఓట్లు రాలడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: