ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పర్వం మొదలైంది.. నేడు రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది.. నేటి నుంచి నామిషన్స్ జాతర మొదలు కానుంది.. ఇప్పటికే ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు జోరు చూపిస్తున్నాయి.. ఒకరి పై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు.. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలు చేస్తూ ఎంతో బిజీగా మారారు.ప్రస్తుతం బాలయ్య బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్టార్ క్యాంపెనర్ గా మారి పార్టీని, పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన బాలయ్య మూడోసారి మరోసారి బరిలోకి దిగారు.. అయితే ఆయన తన నియోజకవర్గంలో పాటు రాయలసీమలో అన్నీ నియోజకవర్గాలలో రోడ్ షో లు చేస్తూ పార్టీ నేతల్లో జోరు పెంచుతున్నారు.. 

అలాగే టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలకృష్ణ చేసే సందడి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మండుటెండల్లో కూడా బాలయ్య జోరు కొనసాగుతూనే ఉంది.ఈ వయసులో కూడా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఊహించని ఎనర్జీతో ఆయన ప్రచారం కొనసాగిస్తున్నారు.. మైకును గాల్లో ఎగరేస్తూ, పంచ్ డైలాగులు పేలుస్తూ బాలకృష్ణ రోడ్ షోలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కూటమిని అధికారంలోకి తెచ్చే విధంగా బాలయ్య ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సారి తాను గెలవడం మాత్రమే కాకుండా తన వల్ల పార్టీకి మరికొన్ని సీట్లు వచ్చేలా నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ప్రచారం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. దీనితో బాలయ్య ప్రచారం పార్టీ వర్గాలలో చర్చనీయాంశం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: