ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాల్లో దూకుడు పెంచుతున్నాయి. ఒకరి మీద ఒకరు మాటల యుద్ధంతో విరుచుకుపడుతున్నారు.అయితే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ విషయానికి వస్తేదేశంలో పుంగనూరు ఆవులు ఏంత ఫేమసో అక్కడ పాలిటిక్స్ కూడా అంతే ఫేమస్.చిత్తూరు జిల్లాలో అతి పెద్దదైనా పుంగనూరు నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తన అడ్డాగా మార్చుకున్నారు. అక్కడ నుండి ఆయన హ్యాట్రిక్ కొట్టి నాలుగోసారి బరిలో ఉన్నారు. అయితే టీడీపీ తరపున చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు.చారిత్రక నేపధ్యం ఉన్న ఈ నియోజకవర్గం నుండి మూడు పర్యాయములు రాజకుటింబికులు శాసన సభకు ఎన్నికయ్యారు.1989లో పెద్దిరెడ్డి తొలిసారిగా పీలేరు నుండి గెలుపొందారు.తర్వాత 1999,2004 లోకూడా అక్కడనుండే గెలిచారు.2009లో మాత్రం నియోజక వర్గాల పునర్విభజనతో పుంగనూరు నుండి బరిలోకి దిగారు.ఆయన 2009,2014 ఎన్నికల్లో అక్కడి నుండి గెలిచారు.2019లోకూడా టీడీపీ అభ్యర్థి అనూష రెడ్డిపై నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.ఈసారి ఎన్నికల్లో పుంగనూరూలో పెద్దిరెడ్డిని ఓడించే లక్ష్యంగా టీడీపీ నుండి చల్లా రామచంద్రారెడ్డిను బరిలోకి దించారు చంద్రబాబు.

ఆయన తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి 1983,85 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు.స్లీపింగ్ మోడ్ లో ఉన్న టీడీపీను చల్లాబాబు రాకతో నిద్రలేపినట్లుంది.మరోవైపు పెద్దిరెడ్డి చేతిలో ఓటమిపాలై వైసీపీలోకి చేరిన వెంకటరమణ రాజు తిరిగి టీడీపీలో చేరడంతో అధికార పార్టీకి షాక్ ఇచ్చినట్లుయింది.2014 నుండి అన్నీ తానై నడిపిస్తున్న పెద్దిరెడ్డి స్థానిక ప్రతినిధులపై కొంత కాలం నుండి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు ఆయన్ని అంటి అంటన్నట్లు ఉన్నట్లు సమాచారం.స్థానికంగా ఆయన్ని కొన్ని ప్రతికులా అంశాలు ఇబ్బందికి గురించేస్తున్నాయి.మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి పై విరుచుకుపడుతున్నారు.దాంతో పుంగనూరులో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఈసారి అక్కడి ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: