ఎందుకో.. ఈ సారి ఏపీ కంటే తెలంగాణ మీదనే బీజేపీ పెద్దలు ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాలు  ఆపార్టీకి కొంత ఆశాకిరణంగా కనిపిస్తోంది. అదే ఏపీ అయితే బాగా కష్టపడాలి. పైగా పొత్తులు ఉన్నాయి. ఏమన్పా పొత్తు పార్టీలు చూసుకుంటాయన్న ధీమా ఉందో..లేక మరేదైనా కారణం కావొచ్చు.


అందుకే మూడు విడతల ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న తర్వాత నాలుగో విడతలో జరిగే ఏపీ, తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ దృష్టి సారించింది. మే 3 తర్వాత తెలంగాణలో ప్రధాని మోదీ వరుస పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నికల ప్రచారం సమాప్తం అయ్యే మే 11లోగా రెండు విడతలుగా తెలంగాణకు వస్తారు అని అంటున్నారు. కనీసం ఆరు నుంచి ఎనిమిది సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ పోరాడుతోంది.


అదే ఏపీ విషయానికొస్తే బీజేపీ అగ్రనేతలు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అసలు ఏపీ వైపు చూస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు కేంద్ర మంత్రులను పంపి.. ఆ తర్వాత ఫినిషింగ్ లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారనే టాక్ నడుస్తోంది.  నడ్డా తర్వాత అమిత్ షా టూర్ కన్మర్మ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కుదిరితే మోదీ కూడా ఏపీ పర్యటనకు రావొచ్చు.


గతంలో 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో ఏపీలో పెద్ద ఎత్తున పర్యటించారు. ఆయన తిరుపతి నుంచి విశాఖ  వరకు పర్యటనలు చేసి ఏపీలో ఆనాడు కూటమికి అనుకూల వాతావరణం తీసుకురాగలిగారు. ఈసారి ఇప్పటి వరకు కూటమి తరఫున ఒకే సభ నిర్వహించారు. అందులో కూడా జగన్ పై పొడిపొడిగా విమర్శలు గుప్పించారు.  అయితే చంద్రబాబు ఏమైనా మోదీని ఒప్పించి ఏపీలో రెండు, మూడు సభలు నిర్వహించేలా చూస్తారా.  ఒకవేళ ఇదే జరిగితే ఈ సభలు కూటమి గెలుపునుకు సరిపోయే కిక్కు ఇవ్వగలుగుతాయా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: