వ‌చ్చే ఎన్నిక‌ల్లోవిజ‌యం త‌థ్య‌మ‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతు న్న ప‌రిణామాలు.. త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. ఎంత కాద‌న్నా.. డ‌బ్బులు పంచందే ఎన్నిక‌ల్లో విజ యం ద‌క్కించుకోవ‌డం క‌ష్టం. అయితే.. ఈ విష‌యంలో టీడీపీ అభ్య‌ర్థులు స‌గం మంది.. చంద్ర‌బాబుపై నే ఆధార‌ప‌డ్డారు. డ‌బ్బులు లేక కాదు.. ప్ర‌స్తుతం వ‌స్తున్న స‌ర్వేలు చూసి.. వారు.. డ‌బ్బులు తీయ‌డం లేద‌ని స‌మాచారం. కొంద‌రు డ‌బ్బులు ఉండి తీయ‌డం లేదు. మ‌రికొంద‌రు.. త‌క్కువగా ఉండితీయ‌డం లేదు.

అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలో మాత్రం డ‌బ్బు లు బాగానే ఖ‌ర్చు పెడుతున్నారు. విశాఖ‌లో మాత్రం పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న బాల‌య్య చిన్న‌ల్లుడు ముఖం చాటేస్తున్నార‌ని పార్టీ సీనియ‌ర్లే చెబుతున్నారు. ఇక‌, న‌గ‌రిలో ఎమ్మెల్యే అభ్య‌ర్థి.. గాలి భానుప్ర‌కాశ్ ప‌రిస్థితి మ‌రోవిధంగా ఉంది. ఆయ‌న ద‌గ్గ‌ర సొమ్ములు లేవు. ఉంటే ఖ‌ర్చుపెట్టాల‌ని చూస్తున్నారు. ఇక‌, పెన‌మ‌లూరుప‌రిస్థితి మ‌రో విధంగాఉంది.

ఇక్క‌డ జోగి ర‌మేష్ వైసీపీత‌ర‌ఫున పోటీలో ఉన్నారు. అయితే.. ఈయ‌న టీడీపీ అభ్య‌ర్థిపై త‌న వ‌ర్గంతో డేగ‌కన్నేశారు. దీంతో ఇక్క‌డ రూపాయి తీయాలంటే.. ఏం జ‌రుగుతుందో అని హ‌డలి పోతున్నారు. మ‌రోవైపు తాడిప‌త్రి నుంచి బ‌రిలో ఉన్న అస్మిత్ రెడ్డి కూడా. రూపాయి కూడా తీయ‌డం లేదు. పైగా.. మాకు ఎందుకు వేయ‌రు.. అంటూ.. బెదిరింపు ధోర‌ణిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మాధ్య‌మాల్లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

ఇలానే.. విశాఖ‌లోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిస్థితి ఉంది. చంద్ర‌బాబు ఇమేజ్‌ను న‌మ్ముకున్నామ‌ని మ‌రికొంద‌రు చెబుతుంటే.. ఏమో 2019 రిజ‌ల్ట్ వ‌స్తే.. మొత్తానికే మునిగిపోతామ‌ని మ‌రికొంద‌రు లెక్క‌లు వేసుకుంటున్నారు. దీంతో 80 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు రూపాయి కూడా తీయ‌డం లేదు. మంగ‌ళ‌గిరి లోనూ అంతే. చిత్రం ఏంటంటే.. ఇక్క‌డ బ్యాన‌ర్లు క‌ట్టిన వారికి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని.. పార్టీ కార్యాల‌యానికి తిరుగుతున్నారు. వీరికి వ‌ర్ల రామ‌య్య ర‌హ‌స్యంగా స‌ర్దిచెప్పిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  దీంతో చంద్ర‌బాబు త‌ల ప‌ట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: