బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో కేటీఆర్ ఒకరు. ఈయన బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఐటి మినిస్టర్ గా చాలా సంవత్సరాలు పని చేశారు. ఇక ఐటి మినిస్టర్ గా ఈయన హైదరాబాద్ ను డెవలప్ చేసిన విధానానికి ఎంతో మంది ప్రజలు కూడా ఈయనను మెచ్చుకున్నారు. దానితో బీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం సీట్లను తెచ్చుకోకపోయినప్పటికీ హైదరాబాదులో భారీ ఎత్తున సీట్లను దక్కించుకోగలిగింది. దానితో బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్ గా ఓడిపోయినప్పటికీ హైదరాబాదులో మాత్రం మంచి సీట్లను తెచ్చుకుంది.

ఆ క్రెడిట్ అంతా కూడా కేటీఆర్ కే దక్కింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి కోసం ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాండిడేట్ లను కూడా సెలెక్ట్ చేసింది. ఇక ఈ పార్టీ ముఖ్య వ్యక్తులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను తిరుగుతూ ప్రచారాలను చేస్తున్నారు. ముఖ్యంగా వీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంత వరకు ఫెయిల్ అయ్యింది అనే దాన్నే ఎక్కువ శాతం ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు.

అందులో భాగంగా తాజాగా కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అందులో భాగంగా ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది... ఇప్పుడు ఏం చేస్తుంది అనే దానిని వివరించాడు. తాజా కేటీఆర్ పోస్ట్ ప్రకారం... ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక... అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు.

ఫిబ్రవరి 1 వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తా పత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చింది.  వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ ఇలా అనేక విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయింది అని కేటీఆర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: