తెలంగాణ వచ్చాక రెండుసార్లు రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న బిఆర్ఎస్ పార్టీ ఇక మూడోసారి మాత్రం హ్యాట్రిక్ కొట్ట లేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా అప్పటికే ఓడిపోయాము అనే బాధలో ఉన్న బిఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా కారు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. బిఆర్ఎస్ తరఫున గెలిచిన సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు.


 గెలిచిన వాళ్ళే పోతున్నారు మేము ఒక లెక్క అన్నట్లుగా ఇక ఎంతోమంది మాజీలు కూడా అటు పార్టీ మారుతూ ఉండడం గమనార్హం. దీంతో రానున్న రోజుల్లో ఇలా కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి నెలకొన్న నేపథ్యంలో ఇక ఇప్పుడు కారు పార్టీకి మరో షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి కి చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రేవంత్ రెడ్డికి తెలియజేశారు  ఇక తన అనుచరులతో కలిసి సీఎం సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారట. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం మహేందర్, బిఆర్ఎస్ కీలక నేత కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కడియం కావ్య కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. వీరితోపాటు ఎంపీలు ముఖ్య నేతలు అందరూ కూడా కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి చేయందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: