ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ నేతలు ఆయా అధినేతలకు గట్టి షాక్‌లు ఇస్తున్నారు. కీలకంగా ఉన్న నేతల అనూహ్యంగా పార్టీలు మారుతూ చాలా నష్టం కలిగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాజాగా టీడీపీ పార్టీకి షార్ట్ తగిలింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నేతలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)లోకి జంపు చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల ర‌జినీ నేతృత్వంలో ఈ నేత‌లు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త సభ్యులకు లాంఛనంగా కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. రీసెంట్‌గా జగన్ కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ.రాజపురం "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర చేపట్టారు. అయితే ఇక్కడే రాత్రి బస చేసిన ప్రాంతంలో, నమోదు కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి మారిన ప్రముఖ వ్యక్తులు మాజీ కార్పొరేటర్ ఎస్. కే సైదా, మొండి బండ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మాధవయ్యయాదవ్.

 ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధరరావు గెలుపొందారు. గిరిధరరావు 71,864 ఓట్లు సాధించి, 67,575 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నంపై విజయం సాధించారు. నియోజకవర్గంలో మొత్తం 265,258 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవలి చేరికలు రెండు పార్టీల విజయవకాశాలను ప్రభావితం చేస్తూ, ఈ ప్రాంతంలో రాజకీయ దృశ్యాన్ని మార్చేశాయని చెప్పుకోవచ్చు.

 ఇకపోతే పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన 25 సీట్లలో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టుకోలేక సతమతమవుతున్నాడు. ఆయన ఎమ్మెల్యే సీట్లను అమ్ముకుంటున్నాడని ఆరోపణలు కూడా వస్తున్నాయి. బీజేపీతో కలిసి టీడీపీ పార్టీ తనకు తానే చేటు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి టీడీపీకి బాగానే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: