హిందూపురం నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థిగా బాలయ్య నిలబడిన సంగతి తెలిసిందే..ఈ రోజున ఆయన భార్య వసుంధర తో కలిసి హిందూపూర్ లో నామినేషన్ వేశారు . ముఖ్యంగా కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు బాలయ్య నామినేషన్ కు భారీ గాని తరలివచ్చారు.. అయితే ఈ నామినేషన్ పత్రాలలో బాలయ్య ఆస్తులు అప్పుల వివరాలను కూడా అఫీడవిట్ లో చూపించారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


బాలయ్య నామినేషన్ లో చూపించిన విషయం మేరకు బాలయ్య ఆస్తి విలువ రూ.81.63 కోట్లు  ఉందని.. ఆయన భార్య వసుంధర పేరు మీద రూ .140.38 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తన కుమారుడు మోక్షజ్ఞ మీద రూ .48 కోట్ల 63 లక్షల  ఆస్తి ఉన్నట్లు తెలియజేశారు.. ఇక అప్పుల విషయానికి వస్తే..9.9 కోట్ల 22 వేల అప్పు ఉన్నట్లుగా అఫీడవిట్ లో తెలియజేశారు.. తన భార్య వసుంధర పేరు మీద రూ .3కోట్ల 83 లక్షల 89000 ఉన్నట్లుగా చూపించారు.


బాలకృష్ణ తన భార్య వసుంధర దేవితో సెంటిమెంట్ అని చెప్పి.. దగ్గరలో ఉండే ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి మరి మధ్యాహ్న 12:30 సమయంలో నామినేషన్ వేశారు. అనంతరం బాలకృష్ణ బయటికి రాగా నాయకలు పెద్ద ఎత్తున జై బాలయ్య అనే నినాదంతో రచ్చ లేపారు.. ఈసారి హిందూపూర్ లో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నానని ఇప్పటికే బాలయ్య ఎన్నోసార్లు తెలియజేశారు.. నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతున్నానని ఇప్పటికి హిందూపూర్ ప్రజలు తనని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు ఈసారి కూడా గెలిపిస్తారని ఆశిస్తున్నాను.. అలాగే హిందూపూర్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా దగ్గరుండి మరి చూసుకుంటున్నానని తాగునీటి సమస్యను, సీసీ రోడ్లు కు ఇతరత్న నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము ఈసారి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ హిందూపురంలో ఏర్పాటు చేస్తాము అంటే బాలయ్య తెలియజేశారు. ప్రస్తుతం బాలయ్య ఆస్తుల విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: