ఇలా బీ ఫారం చేతిలో పడగానే.. అలా నామినేషన్లు వేస్తున్నారు కూటమి నేతలు. అది కూడా నామినేషన్ల తొలి రోజే వేయడం విశేషం. చాలా మంది ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా చాలా రోజుల ముందు నుంచే ముహూర్తం పెట్టుకొని కూర్చున్నారు. ఇలా నోటిఫికేషన్ రావడమే ఆలస్యం.. నామినేషన్ల పర్వం ముగించేస్తున్నారు.


ఏప్రిల్ 18న నాలుగో విడతగా ఏపీలో నామినేషన్ల ఘట్టానికి తెర లేచింది. తొలి రోజునే పెద్ద ఎత్తున నామినేషన్లు పడటం ఈ సారి విశేషం. వాస్తవంగా నామినేషన్ల చివరి రోజు.. కానీ మంచి ముహూర్తం కోసమని ఇలా రకరకాల కారణాలతో అభ్యర్థులు నామినేషన్లు ఆలస్యంగా వేస్తుంటారు. కానీ ఈ సారి ముందురోజు నుంచే ఈ సందడి కనిపించడం విశేషం. ఇందులో ఎక్కువగా కూటమి అభ్యర్థులే ఉండటం మరో విశేషం.


ఇలా ఎందుకు అంటే.. నామినేషన్ల తొలి రోజే ఒక టీడీపీ అభ్యర్థిత్వం పోయింది. అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ సీటుకి మొదట టీడీపీ తరఫున ప్రకటించిన ఎన్నారై పైలా ప్రసాద రావు ప్లేస్ లో మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీంతో పైలా ఆశలు అడియాశలయ్యాయి. దీనిని చూసిన వారు ఇంకా మరికొన్ని సీట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్న వారు అంతా.. ఎందుకైనా మంచిదని నామినేషన్లు వేస్తున్నారు.


భీమిలి టికెట్ ఎంతో పోరాడి తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు మొదటి రోజునే నామినేషన్ వేసేసి ఒక పని అయిపోయిందని అనిపించారు. మరోవైపు  ఒంగోలు లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థివ బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ స్థానానికి బీజేపీ తరఫున మాజీ మంత్రి సుజనా చౌదరి తొలి రోజునే నామినేషన్లు వేశారు. వీరంతా అధినాయకత్వం ఎత్తుల పై ఎత్తులు వేసేందుకు ఇలా చేశారని అంటున్నారు. పవన్ కూడా తన 21 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చి మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా చేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: