* రాజకీయాల్లో శత్రువులే కాదు చిరకాల మిత్రులు ఉంటారు  

* ఆ విషయాన్ని నిరూపిస్తున్న కొడాలి నాని, వంశీ వంగవీటి రాధా

* వారి స్నేహం చూసి ముచ్చట పడుతున్న ప్రజలు

సాధారణంగా రాజకీయాలు స్నేహితులను విడదీస్తాయని అంటారు. అయితే ఆ విషయం అబద్ధమని కొందరు రాజకీయ ప్రముఖులు నిరూపిస్తున్నారు. వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరి ముగ్గురి మధ్య స్నేహం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటుంది.

* కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ స్నేహం

రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్‌ మధ్య బలమైన స్నేహబంధం కొనసాగుతోంది. వారు పార్టీ లైన్లకు అతీతంగా సంవత్సరాల తరబడి మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీని వైసీపీకి కొడాలి నాని తీసుకురాగలిగారు. వీరిద్దరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రొడ్యూస్ చేశారు. వీరి స్నేహం ఇప్పటిది కాదు. కొంతకాలం పాటు ఇరువురు వేరే పార్టీల్లో కొనసాగారేమో కానీ ఆ సమయంలో వారి స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు.

నాని, వంశీ వేర్వేరు పార్టీలతో కలిసి ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు మద్దతుగా నిలిచారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వీరి స్నేహం చెప్పుకోదగ్గ అంశం.

* వంగవీటి రాధా, కొడాలి నాని

కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా మంచి ఫ్రెండ్ అవుతారు. వారు ఒకరినొకరు అన్నదమ్ములుగా భావిస్తారు. వివిధ రాజకీయ పార్టీల్లో (కాంగ్రెస్‌లో రాధా, టీడీపీలో నాని మొదట) ఉన్నప్పటికీ వారి స్నేహం చెక్కుచెదరలేదు.  ఇప్పుడు నాని వైఎస్సార్‌సీపీలో ఉండగా, రాధా మాత్రం టీడీపీలో ఉన్నారు. అయినా ఒకరికొకరు ఎప్పుడూ మద్దతుగానే ఉంటారు.

* వంగవీటి రాధా, వల్లభనేని వంశీ మోహన్

రాధ, వంశీ కూడా స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. వివిధ రాజకీయ శిబిరాలకు చెందిన వారు అయినప్పటికీ వారి అనుబంధం స్నేహపూర్వకంగా ఉంది. అధికార వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం ఉందని రాధా ఇటీవల ప్రకటన చేశారు. నిజానికి అతడిని వైసీపీలోకి తీసుకురావాలని కొడాలి నాని, వల్లభనేని వంశీ బాగా ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఆ విషయంలో విజయం సాధించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: