ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  అన్ని పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇక బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు అందరిని కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటూ ఆ పార్టీ అధినేత కేసిఆర్ కు వరుసగా షాకులు ఇస్తుంది. ఇక ఇప్పుడు ఏకంగా కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించి కెసిఆర్ ను మానసికంగా కూడా దెబ్బకొట్టాలని అనుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే అక్కడి నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న బీసీ అభ్యర్థి నీలం మదును బరిలోకి దింపారు అన్న విషయం తెలిసిందే.


 నీలం మధును గెలిపించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్రంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఇటీవల నామినేషన్ వేయడానికి వెళ్లిన సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీలో పాల్గొన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో తప్పకుండా విజయం సాధించాలని ఇక ఈ గెలుపును కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నది అర్థమవుతుంది. అదే సమయంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువసార్లు విజయం సాధించింది. ఎక్కువ సార్లు విజయం సాధించిన అభ్యర్థి ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 1952లో మెదక్ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది  అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అత్యధిక సార్లు విజయం సాధించింది. 18 సార్లు ఎన్నికలు జరగగా.. పిడిఎఫ్, టిపిఎస్, బిజెపి, టిడిపి లకు కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఇక్కడ అవకాశం దొరికింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వీరిలో బాగా రెడ్డి అత్యధిక సార్లు ఎంపీగా మెదక్ నుంచి ఎంపీ కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన బాగా రెడ్డి 1989 లో గెలుపొంది తర్వాత వరుసగా నాలుగు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తూ వచ్చారు. ఇక 2004 నుంచి ఇక్కడ బిఆర్ఎస్ విజయం సాధిస్తూ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: