తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గక ముందే.. పార్లమెంట్ ఎలక్షన్స్ రావడంతో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పాలి. ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు.


 ఈ క్రమంలోనే ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. మరి ముఖ్యంగా బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్లో విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గులాబీ పార్టీలోని కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకుని కేసీఆర్ను బలం లేకుండా చేస్తున్న కాంగ్రెస్.. ఇక మెదక్లో విజయం సాధించి  మానసికంగా కూడా కేసీఆర్ ను దెబ్బ కొట్టాలని అనుకుంటుంది. అయితే ఇక్కడి నుంచి ఒక సామాన్యుడిని బరిలోకి దింపింది అని చెప్పాలి. కేవలం ఇప్పటివరకు సర్పంచ్ గా మాత్రమే పని చేసిన అనుభవం ఉన్న బీసీ అభ్యర్థి నీలం మధును అభ్యర్థిగా నిలబెట్టింది కాంగ్రెస్. అయితే నీలం మధు రాజకీయ ప్రస్తానం చూసుకుంటే ఆయన చిట్కుల్ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఇక ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిపాల్ రెడ్డి పై బిఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పరాజయం పాలయ్యారు. ఇలా ఇప్పటివరకు కేవలం సర్పంచ్ పదవి మాత్రమే చేపట్టిన నీలం మధు.. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని గెలిపించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక మైనంపల్లి హనుమంతరావు సైతం ఇక నీలం మధు వెంటే  ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ చిట్కుల్ గ్రామ సర్పంచ్ అటు మెదక్ ఎంపీగా గెలవబోతున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mp