ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది జగన్ పై గురకరాయి దాడి. విజయవాడ పర్యటనలో ఉన్న సందర్భంలో గులకరాయితో జగన్ పై ఎవరో వ్యక్తులు దాడి చేశారు దీంతో ఆయన తలపై గాయమైంది. అయితే ఈ కేసులో  A2గా వేముల దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారించడం మొదలుపెట్టారు. చివరికి ఆయన నుంచి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో దుర్గారావును  పోలీసులు ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా దుర్గారావు  మీడియాతో మాట్లాడుతూ అసలు నిజాలు బయటపెట్టారు.
 
పోలీసులు  అక్రమంగా తీసుకెళ్లి విచారణ చేశారని, నేను చేయని పనికి జగన్ పై నువ్వు ఎందుకు దాడి చేశావు అని ప్రశ్నించారని అన్నారు.  తనకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా కానీ పోలీసులు వినిపించుకోలేదని , సతీష్ అనే వ్యక్తి నీ పేరు చెప్పాడని  నువ్వు నేరం ఒప్పుకోవాలని గట్టిగా మందలించారని దుర్గారావు తెలియజేశాడు. నువ్వే సతీష్ తో దాడి చేయించావు  టిడిపిలో తిరుగుతావు కదా టిడిపి నేత బోండా ఉమా చేయమని చెప్పారు కదా అని పోలీసులు నన్ను చాలా సార్లు గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగారు. అసలు ఆ ఘటనకు  నాకు సంబంధం లేదని, నాతో ఎవరు చెప్పలేదని దుర్గారావు తెలియజేశారట.  కానీ పోలీసులు వినిపించుకోకుండా దీనిలో టిడిపి నాయకుల ప్రమేయం ఉంది  అంటూ తనను టార్చర్ పెట్టారని దుర్గారావు తెలియజేశారు.

అంతేకాకుండా తన ఫోన్ తీసుకొని పూర్తిగా చెక్ చేశారని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మూడు రోజుల పాటు అతన్ని అనేక కోణాల్లో విచరించారని  చివరికి ఎలాంటి తప్పులు చేయలేదని తెలుసుకొని  తన ఇంటి వద్ద వదిలేసారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దుర్గారావు తరపున వాదించే న్యాయవాది అబ్దుల్ సలీం మాట్లాడుతూ  దుర్గారావును కావాలనే ఇరికించారని  ఎటువంటి ఆధారాలు లేకపోయినా తనను టార్గెట్ చేసి ఒప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. ఎంత టార్చర్ చేసినా చెయ్యని తప్పును దుర్గారావు ఒప్పుకోకపోవడంతో  తనను ఇంటికి పంపారని  తెలియజేశారు. దుర్గారావుకు న్యాయపరమైన సాయం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని  కోర్టులో కూడా నిర్దోషిగా ఋజువు చేస్తానని అబ్దుల్ సలీం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: