ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఎక్కువగా ప్రచారంలో ఉన్నారు. క్షణం తీరిక లేనటువంటి సమయాన్ని కూడా కలుపుతున్న సమయంలో ఏపీ మహిళా ఒకరు ఢిల్లీలో ఒక కలకలాన్ని సృష్టిస్తోంది. ఆంధ్రాలో జరుగుతున్న అరాచకాల పైన నిరసనను తెలియజేస్తూ తన చేతి వేలిని నరుక్కొని మరి కలకలాన్ని సృష్టిస్తోంది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆ ఘటన పైన ఇప్పుడు పడింది. అయితే ఆమె ఎలా ఎందుకు చేసింది అనే విషయం పైన అందరూ ఆశ్చర్యపోతున్నారు.వాటి గురించి చూద్దాం.


ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ లక్ష్మీ అనే మహిళ గత కొద్ది రోజులుగా పోరాడుతోందట. ఇమే ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కూడ.. మాజీ హోంమంత్రి సుచరిత ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నది.. ముఖ్యంగా ప్రతిపాడు నియోజవర్గంలో ఒక ముఠా గుంపు పైన ఆమె పోరాడుతున్నట్లుగా తెలియజేసింది. చిన్న వయసులోనే పిల్లలకు గంజాయి అలవాటు చేయడం వాటినీ  ఆమ్మించడం,భూకబ్జాలు వంటివి చేయడం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. మాజీ హోం మంత్రి సుచరిత అనుచరులు ఇలా చేస్తున్నారని వీటిపైన కలెక్టర్లకు, ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశారంటూ తెలియజేస్తోంది.


అక్కడ స్థానికంగా అధికారులు నేతలు ఎవరూ పట్టించుకోకపోవడంతో లక్ష్మీ ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ ఇండియా గేట్ వద్ద తన బొటనవేలు కోసుకుంటూ ఆవేదనను తెలియజేస్తోందట. మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వరకు వెళ్లిందట. అయితే రాష్ట్రపతి, ప్రధాని కలిసేందుకు అవకాశం దొరకపోవడంతో ఇలాంటి పని చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ నరుక్కున్న వేలుకి ఆపరేషన్ చేయించుకున్నట్లుగా తెలియజేసింది. ఆంధ్రాలో జరుగుతున్న అవినీతి అక్రమాల అరాచకాలను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఇలాంటి పని చేశానంటూ లక్ష్మి తెలియజేస్తోంది. మరి ఇప్పటికైనా రాష్ట్రపతి స్పందించాలంటు కోరుతోంది. ఈ విషయం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: