ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక్క జగన్ పై  ఓవైపు టిడిపి కూటమి మరోవైపు తన చెల్లి షర్మిల ముప్పెట దాడులు చేస్తున్నారు.  అయినా జగన్ అన్నీ తట్టుకొని సింహం సింగిల్ గా వస్తుంది అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇదే తరుణంలో జగన్ చెల్లి షర్మిల నామినేషన్ వేసే సమయంలో తన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.ఈ సందర్భంగా షర్మిలా తన ఆస్తులు కాకుండా తనకున్న అప్పులను కూడా క్లియర్ గా చెప్పింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ప్రస్తుతం జగన్ పై తన చెల్లెళ్లు ఇద్దరు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అయితే వారు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కేసును  హైలెట్ గా చేస్తూ దూసుకుపోతున్నారు. 

మరి వారికి వివేకా హత్య కేసు మీదే  ఆలోచన ఉందా లేదంటే జగన్ ఆస్తులు పంచి ఇవ్వలేదనే కోపం ఉందా అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న.. కానీ ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికినట్టు అయింది. అయితే షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డి తాను చనిపోయే ముందే  తన ఆస్తిని మూడు భాగాలుగా విభజించి  షేర్ల వారీగా  జగన్ కు 33% , భార్యకి 33%, షర్మిల కి 33% ఇలా పూర్తి ఆస్తులను  ఎవరికి వారికే పంచేశారు. కానీ షర్మిల తనకు పుట్టింటి నుంచి రావాల్సిన వాటా ఇంకా రాలేదని చాలాసార్లు మీడియా ముందు చెప్పింది. తాజాగా తన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు బయటపెట్టింది. మొత్తం షర్మిల ఆస్తుల విలువ 132 కోట్లు. కానీ ఆమెకు ఉన్న అప్పులు రూ:82 కోట్లాట. ఇందులో తన సోదరుడైన ఆంధ్రప్రదేశ్ సీఎం  జగన్మోహన్ రెడ్డికి రూ:82.58 కోట్ల  రూపాయలు బాకీ ఉందట.

అయితే షర్మిల తన నామినేషన్ దాఖల పత్రంలో ఈ వివరాలు ప్రకటించింది. అంతేకాకుండా జగన్ భార్య భారతికి కూడా రూ:19.56 కోట్ల రూపాయల బాకీ ఉందట. ఈ విధంగా షర్మిల తన నామినేషన్ సమయంలో ఎన్నికల  ఆఫిడవిట్ లో ఈ వివరాలు పేర్కొంది. అయితే ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకే తండ్రికి పుట్టిన మీకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. ఆ ఆస్తులను జగన్ కాపాడాడు కాబట్టి ఇప్పుడు మీరు అడుగుతున్నారు. సరే ఆస్తులు జగన్ పంచి ఇస్తాడు కావచ్చు, అక్రమాస్తుల కేసులో  జగన్ దాదాపు సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు షర్మిల. ఆస్తుల్లో సగభాగం అడిగినప్పుడు, కేసుల్లో కూడా భాగం నీకు ఉండాలి కదా. కేసులు వచ్చినప్పుడు వెనక ఉంటావు, ఆస్తులు మిగిలితే నాకు వాటా వస్తుందంటున్నావు. ఒకవేళ జగన్ సీఎం కాకుండా పూర్తిస్థాయిలో జైల్లో ఉంటే  ఆ ఆస్తులు నువ్వు అడిగేదానివా అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: