ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఎక్కడచూసిన ఎన్నికల వేడి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో ఈ ఎన్నికల వేడి కాస్త డబుల్ అయింది అని చెప్పాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రతిపక్షంగా, ప్రతిపక్ష పార్టీ అధికార హోదాకి చేరుకున్నాయి. ఇక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలను ఈ రెండు పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుండగా.. ప్రతిపక్ష బి ఆర్ ఎస్  సైతం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉండడం గమనార్హం.



 అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన చేయలేదు. అటు ఖమ్మం సహా కరీంనగర్ ఎంపీ అభ్యర్థులను ఇప్పుడు వరకు ప్రకటించలేదు. అయితే ఇక ఈ టికెట్ ఎవరికి దక్కుతుంది అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.  ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తూ ఉండడం గమనార్హం. అటు కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది నామినేషన్ వేసాడు. కానీ ఇలాంటి నామినేషన్ల వర్గం కొనసాగుతున్న సమయంలో ఇటీవలే కాంగ్రెస్ లో ఒక ట్విస్ట్  చోటుచేసుకుంది. ఏకంగా ఇంకా అభ్యర్థి ఖరారు కానీ ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు అయింది.


 కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ నామినేషన్ వేశారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఆయన ఇలా నామినేషన్ వేయడం సంచలనంగా మారిపోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా పలువురు జిల్లా నేతలతో కలిసి ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆసక్తిని రేపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగిందా లేదంటే పార్టీలో ఏదైనా ముసలం కొనసాగుతుందా అనేది విషయంపై చర్చ జరుగుతోంది. ఇంకోవైపు కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి నేడు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ కానున్నాడు. ఈ ఆసక్తికర పరిణామం ఎక్కడ వరకు దారితీస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: