మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం మనకు తెలిసిందే. రాబోయే ఎన్నికల కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ లు చాలా చురుగ్గా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల క్యాండేట్లను సెలెక్ట్ చేసి ప్రచారాలను కూడా జోరుగా ముందుకు సాగిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం సీట్ల పంపిన విషయంలో తర్జన బర్జన పడుతోంది.

ఇప్పటివరకే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అన్ని ఏరియాలో సీట్లను ఓకే చేసినప్పటికీ రెండు ఏరియాల్లో మాత్రం సీట్లను కన్ఫామ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం మరియు కరీంనగర్ సీట్లను ఎవరికి కేటాయించలేదు. ఖమ్మం ఎంపీ సీటు కోసం గురించి భారీ ఫైట్ నడుస్తోంది. ఇక్కడ సీట్ కోసం అనేక మంది లీడర్లు పోటీ పడుతూ ఉండడంతో హై కామెంట్ కూడా నిర్ణయం తీసుకోవడంలో కాస్త వెనక ముందు ఆడుతుంది.

పొంగులేటి ప్రసాద్‌రెడ్డి , మండవ మధ్యే ప్రధానంగా పోటీ ఉందని తెలుస్తోంది. ఎన్ని రోజుల పాటు ఈ టికెట్ ను బట్టి నందిని కూడా ఆశించింది. కానీ ఈమె ఈ టికెట్ రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. సోదరుడు ప్రసాద్‌ రెడ్డి కి టికెట్ కోసం మంత్రి పొంగులేటి తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి తాజాగా మండవ పేరు కూడా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే మండవ వెంకటేశ్వరరావు నాన్‌ లోకల్‌ అనే వాదన తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఇక్కడ టికెట్ ను అధిష్టానం ఎవరికీ ఇస్తుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిన అవసరం వచ్చేలా ఉంది. కరీంనగర్ ఎంపీ సీటు విషయంలో కూడా ఇదే పరిస్థితి. నామినేషన్ గడువు దగ్గర పడుతున్న ఇప్పటికి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఇక్కడి ఎంపీ సీట్ గురించి ఆశిస్తున్న సభ్యులు అంతా గందరగోళంలో ఉన్నారు. కాంగ్రెస్ తరపు నుండి కరీంనగర్ ఎంపీ సీటును వెలిచాల రాజేందర్‌రావు ఆశిస్తున్నారు.

ఈయనకే దాదాపుగా సీట్ కన్ఫామ్ అయ్యింది అని మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుంది అని ఈయనకు అతి దగ్గర వ్యక్తుల నుండి సమాచారం బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు ఎంపీ సీట్ల విషయంలో కాంగ్రెస్ ఎవరికీ ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: