దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అధికార బీజేపీ మరో సారి కేంద్రం లో అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తం ముస్లింలకే పంచేస్తుంది అంటూ మోదీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసారు.మోదీ తాజా వ్యాఖ్యల్లో ముస్లింల ప్రస్తావన తీసుకురావటం అలాగే దానికి కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆధారంగా చూపించటం పెద్ద చర్చకు దారి తీస్తుంది..కాంగ్రెస్ పార్టీ మైనార్టీల వైపు పూర్తిగా మద్దతు ఇస్తుంది... మెజార్టీ హిందువుల ఆస్తులపై గురి పెట్టినట్లు గా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ కు పట్టున్న రాజస్థాన్ లో మోదీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావటం చూస్తే.. వ్యాఖ్యలు మొత్తం వ్యూహాత్మకమేనని తెలుస్తుంది.కాంగ్రెస్ ఆరోపించినట్లుగా మొదటి దశ పోలింగ్ జరిగిన 13 రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి తాము అనుకున్నట్లుగా జరగకపోవటంతోనే ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యనిస్తుంది.

దేశంలో మొదటి దశ లో 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది.. మొదటి దశ తో పోలిస్తే.. బీజేపీ కి రెండో దశ, మూడో దశ ఎంతో ముఖ్యం.దీంతో.. తమ ఓటు బ్యాంకును సమీకరించుకోవటంతో పాటు.. వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.దీనితో తమ ఓటు బ్యాంక్ ను మరింత బలోపేతం చేసేందుకు వీలుగా  ప్రధాని మోడీ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు వచ్చి ఉంటాయని తెలుస్తుంది.తాజాగా మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కాస్త ఒత్తిడిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.తాము టార్గెట్ చేసిన 400 ప్లస్ సీట్ల సాధన కష్టంగా మారుతుండటం. అలాగే 370 స్థానాలు ఖాయమన్న మాటపై కూడా సందేహాలు వ్యక్తమవుతుండటం మోదీ గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: