రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలోని ప్రతి వర్గంలోని ప్రజలకు  ఒక భరోసా.. మన వర్గం వేరే వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాలను ఒకే విధంగా  చూసినప్పుడే ఆయన నిజమైన రాజకీయ నాయకుడు అవుతారు. కానీ జగన్ ప్రభుత్వంలో ఉంటే పూర్తిగా రెడ్ల రాజ్యమే రాజ్యమేలుతోందట. ప్రజలందరూ నా దేవుళ్ళు వారందరినీ నేను కాపాడుకుంటాను అని పైకి చెబుతున్నాడు కానీ  లోపల మాత్రం రెడ్లకే పెద్దపీట వేస్తున్నట్టు కొన్ని సంఘటనలు చూస్తే అర్థం చేసుకోవచ్చని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని పెద్ద పెద్ద శాఖల్లో ఎక్కువమంది రెడ్లే ఉన్నారని, వారంతా జగన్ కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఈ మధ్యకాలంలో  టిడిపి నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ ఫిర్యాదు చేశారు.

ఇది మరవకముందే మరో ఘటన కూడా బయటకు వచ్చింది. ఆ వివరాలు ఏంటంటే.. జగన్ అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో రెడ్లు ఎక్కువగా ఉండడమే కాకుండా అధికారుల్లో కూడా రెడ్లే ఎక్కువగా ఉంటున్నారని, అంతేకాకుండా డిప్యూటేషన్ మీద కేంద్రంలో పనిచేస్తున్న వారిని కూడా ఆంధ్రప్రదేశ్లోకి తీసుకువచ్చి  రెడ్ల కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని నీలాయపల్లి విజయ్ కుమార్ తాజాగా ఆరోపణ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యూటేషన్ మీద వచ్చిన ధర్మారెడ్డి, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్ రెడ్డి  ఇలాంటి అధికారులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారి లక్షలాది కోట్ల రూపాయల జగన్ అవినీతిలో భాగస్వాములు అవుతున్నారని ఆరోపించారు.

 జగన్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కేంద్రం నుంచి అధికారులు 18 మంది డిప్యూటేషన్ మీద వస్తే వారిలో పదిమంది  జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని వీరందరికీ మైన్స్, బేవరేజెస్,  రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఫైనాన్స్ వంటి కీలక విభాగాలు అప్పజెప్పారని,అందుకే వీరంతా అధికారుల్లా కాకుండా జగన్ కి తొత్తుల్లా వీరవిధేయత చూపిస్తున్నారని  అన్నారు. వీరి వల్ల ఈ ఎన్నికల్లో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని  ఆందోళన వ్యక్తం చేస్తూ వారందరినీ తొందరగా తీసేయాలని  అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి దీనిపై ఎన్నికల సంఘం  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: