గుంటూరు జిల్లా నుంచి లోక్‌స‌భ అభ్య‌ర్థిగా టీడీపీ ఎన్నారై నాయ‌కుడు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.. త‌న ఆస్తుల‌ను ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబానికి ఉన్న ఆస్తుల విలువ‌.. రూ.5705 కోట్లు. ఆయ‌న పేర్కొన్న అఫిడ‌విట్ ప్ర‌కారం.. రూపాయి ఆశించ‌కుండానే ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయాలి. పైగా ఎన్నికల వేళ ఓట‌రు దేవుళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఖ‌ర్చు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇక‌, పెమ్మ‌సాని వ్య‌వ‌హారం చూస్తే. చంద్ర‌బాబును మించి ఆయ‌న ఆస్తిప‌రుడు.


అయితే.. పెమ్మ‌సాని ఆస్తులు రాత్రికిరాత్రి పెరిగిన‌వి కావు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కెరీర్‌ను మ‌లుచుకు న్న ద‌రిమిలా.. ఆయ‌న ఖాతాల‌లో న‌గ‌దు చేరింది. అదేవిధంగా సాధార‌ణ రైతు కుటుంబంలో జ‌న్మించిన పెమ్మ‌సాని.. విజ‌య‌వాడ ఎన్టీఆర్ విశ్వ‌విద్యాల‌యంలో ఎంబీబీఎస్ చ‌దువుకుని.. అమెరికాకు వెళ్లి.. అక్క‌డ కూడా ఉన్నత విద్య‌ను అభ్య‌సించి.. ఉన్న‌త రంగాల‌కు చేరుకున్నారు. అలా అమెరికా, హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ త‌దిత‌ర ప్రాంతా్ల్లో ఆస్తులు కూడ‌గట్టారు.


జ‌నం టాక్ ఇదే!
పెమ్మ‌సాని ఆస్తుల‌పై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. రాష్ట్రంలోనే ఇంత పెద్ద సంప‌ద ఉన్న నాయ‌కుడు.. ఈయనేకావ‌డం. స‌హ‌జంగా నియోజ‌క‌వ‌ర్గంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. నేత కార్మికుల నుంచి  భ‌వ‌న నిర్మాణ కార్మిల‌కు వ‌రకు కూడా అనేక ల‌క్ష‌ల మంది ఈయ‌న‌కు జూ కొడుతున్నారు. పెమ్మ‌సాని క‌నుక ఎంపీ అయితే.. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి తిరుగు ఉండ‌ద‌ని చెబుతు న్నారు. ఇక‌,  నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌చారాన‌న్ని ముమ్మ‌రం చేశారు.


గెలుపు ప‌క్కా                                                                                                                                                                                                                                                                                                            
పెమ్మ‌సాని గెలుపుపైనా టీడీపీ నాయ‌కులు న‌మ్మ‌కంతో ఉన్నారు. గుంటూరు జిల్లాలో గ‌త రెండు ఎన్నిక లు కూడా.. 2014, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి గ‌ల్లా జ‌య‌దేవ్ విజ‌యం ద‌కక్కించుకున్నారు. ఆయ‌న కూడా మిలియ‌నీరే. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో  సొంత నిదుల‌ను వెచ్చించి మ‌రీ అభివృద్ధి చేశారు. ఈ ప‌రిణామాలు.. త‌ర్వాత వ‌చ్చిన డాక్ట‌ర్ పెమ్మానికి ప్ల‌స్ అయింద‌నిపార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. పైగా సౌమ్యుడు.. కావ‌డం మ‌రింత క‌లిసి వ‌స్తున్న అంశం. ఈ నేప‌థ్యంలోనే పెమ్మ‌సాని గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: