భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి, బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకయ్య నాయుడు ఎన్నికల సమయంలో అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తూ బాగా ఆకట్టుకుంటుంటారు. ఉపరాష్ట్రపతి హోదా నుంచి ఆయన ఇటీవల దిగిపోయారు. ఆ కారణంగానే ఈసారి ప్రజలను అలరించే ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. గతంలో ఆయన ఉపన్యాసాలు వినడానికి సమావేశాలకు, వేదికలకు ప్రజలు క్యూ కట్టేవారు. అలాంటి బెస్ట్ స్పీచెస్ ఇచ్చే వెంకయ్య నాయుడు ఇప్పుడు ఆ పని మానేయడం చాలామందిని నిరాశ పరుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఒక వేరే సభకి హాజరై అక్కడ ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన మాట్లాడుతూ నేతలు పార్టీలు మారడం అనేది కలవరపెట్టే తీవ్రమైన ధోరణి అని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఒక పార్టీకి రాజీనామా చేసి వేరొక పార్టీలో చేరడం అంగీకరించదగిన విషయమే కానీ పార్టీలను వీడకుండా సొంత పార్టీ నేతలనే విమర్శించడం సబబు కాదు అని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

"గెలిచాక ప్రజలకు ఏమి ఇవ్వగలరో ఎలాంటి హామీలను నెరవేర్చగలరో వాటిని మాత్రమే ఎలక్షన్ మ్యానిఫెస్టోలో పొందుపరచాలి. చెట్లకు డబ్బులు కాయడం లేదని స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి నేను ఉచితాలకు, ప్రజలకు పెట్టే సంక్షేమ పథకాలకు పూర్తిగా వ్యతిరేకం. విద్యా వైద్యం వంటి సేవలను ఉచితంగా అందించడం మంచిదే. కానీ మిగతా ఉచితాలను ప్రజలు ప్రశ్నించాలి. అసభ్యంగా మాట్లాడుతూ, అక్రమాలకు పాల్పడే వారిని కూడా ప్రజలు తిరస్కరించాలి." అని వెంకయ్య నాయుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర కామెంట్ చేశారు.

ఉపరాష్ట్రపతి హోదా నుంచి దిగిపోయాక రాజకీయాల్లోకి రావడం బాగోదు కాబట్టి పాలిటిక్స్ కి దూరంగా ఉన్నానని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రజా జీవితంలో యాక్టివ్ గా ఉంటూ మంచి చెడులు చెబుతానని వెల్లడించారు. ప్రజాస్వామ్యం కాపాడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తాను చర్చించినట్లు తెలిపారు. నిజానికి చంద్రబాబు నాయుడుకి వెంకయ్య నాయుడు మంచి మిత్రుడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఉచితాలతో రాష్ట్రాన్ని ఇవాళ అంచుకు తీసుకొస్తారన్నట్లు వెంకయ్య నాయుడు మాట్లాడారు.అయితే ఇక్కడ ఆయన ఇచ్చిన సలహా జగన్ కి మాత్రమే కాకుండా బాబుకి కూడా వర్తిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే జగన్ కంటే ఎక్కువ ఉచితాలను తాను ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే వెంకయ్య నాయుడు తన ఫ్రెండ్ కే సలహా ఇచ్చినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: