•కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారసుడిగా ఎంట్రీ

* కర్నూల్ అభివృద్ధి ధ్యేయం

•సాయం చేయడంలో తండ్రి ని మించి తోపు


(అమరావతి - ఇండియా హెరాల్డ్)

సినీ ఇండస్ట్రీలో వారసత్వం ఎలా అయితే కొనసాగుతుందో రాజకీయ రంగంలో కూడా వారసత్వం అలాగే కొనసాగుతోంది.. ఇప్పటికే చాలామంది వారసులు  రాజకీయరంగంలో తండ్రులతో సమానంగా పోటీపడుతూ.. అధికారాలను దక్కించుకుంటున్నారు అయితే.. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి రెండవసారిగా కూడా పదవిలో కొనసాగిన ఈయన  ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కొనసాగి 2001 సెప్టెంబర్ 27న స్వర్గస్తులయ్యారు. ఆయన తదనంతరం ఆయన వారసుడు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.


రాజకీయ వారసత్వ విషయానికి వస్తే తండ్రే కాదు తండ్రికి తగ్గ కొడుకుగా అనిపించుకుంటూ భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి..  ఈరోజు తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారసుడిగా రాజకీయ రంగంలో సత్తా చాటుతున్న కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి రాజకీయరంగం గురించి ఇప్పుడు చూద్దాం.

కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు.. కర్నూలు లోక్సభ నియోజకవర్గ నుండి 14వ లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.. తన తండ్రికి గుర్తుగా తన హయాంలో కర్నూలుకు సమీపంలో కోట్ల రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యుడుగా కొనసాగుతున్నారు.. 1991లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికయి.. 2009లో కూడా 15వ లోక్ సభకు కర్నూలు నుంచి మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యారు


ఇకపోతే ప్రస్తుతం కోట్ల కుటుంబానికి తిప్పలు తప్పేలా అనిపించడం లేదు .రాజకీయాలలో ఉన్నత రాజకీయ కుటుంబంగా గుర్తింపు తెచ్చుకుంది కోట్ల ఫ్యామిలీ.. కోట్ల ఫ్యామిలీకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంచి పేరు ఉంది. ఇప్పుడు టిడిపి అభ్యర్థిగా డోన్ నుంచి పోటీ చేస్తున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు సాగించే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ఇటీవల కన్నీరు కూడా పెట్టుకున్నారు. కొడుమూరు నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కర్నూలు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే బాగుండేదని.. పూర్తి చేయాలని అనుకున్నారని చెప్పుకొచ్చారు. కానీ తన బాధ్యత పూర్తికాకముందే డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేయవలసి వస్తుందంటూ బాధపడ్డారు. అయితే నియోజకవర్గ మారినంత మాత్రాన స్థానిక ప్రజలను వదిలిపెట్టమని స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన స్వయంగా తీరుస్తామని హామీ ఇచ్చారు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి..

ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేదలకు అండగా నిలిచి స్థానికంగా మంచి పేరు దక్కించుకున్నారు.. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి మించి స్థానికంగా ప్రజలకు సేవను అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు జయ సూర్య ప్రకాశ్ రెడ్డి. ప్రస్తుతం డోన్ ఎమ్మెల్యేగా టిడిపి తరఫున పోటీ చేస్తున్న కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి కచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: